శునకం ఎంతో విశ్వాసం ఉన్న జంతువు.అందుకే ప్రతి ఇంటిలో కుక్కను పెంచుకుంటూ ఉంటారు.
కుటుంబంలోని సభ్యుడిలాగా ఆ కుక్కలు కలిసిపోతుంటారు.కుక్కలు ఇంట్లో ఎవ్వరికైనా ప్రమాదం వాటిల్లుతుంటే ముందుగానే పసిగట్టి ఆ ప్రమాదాన్ని ఆపుతాయి.
వాటి మీద ప్రేమ చూపిస్తే ఇక ఆ కుక్కలు ఎన్నటికీ విడిచివెళ్లవు.అంతేకాదు ఆ శునకాలు అంగరక్షకునిలా మారి సేవలు చేస్తుంటాయి.
చాలా మందికి కుక్కలు కాపాడిన ఘటనలు ఉన్నాయి.సోషల్ మీడియా వేదికగా కుక్కలు చేసే పనులు, అవి కాపాడిన తీరు, అవి చూపించే విశ్వాసం, ఇలా ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.
కొంతమంది కుక్కలు ట్రైనింగ్ ఇచ్చి మరీ తమతో పనులు చేయించుకుంటారు.పోలీసులు కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి దొంగలను వెతికే పనులు చేయించుకుంటారు.
ఇంకొందరు ఇంట్లో తమ సరుకులు తీసుకురమ్మనో లేకుంటే ఇంట్లోకి వెళ్లి ఏదో ఒక వస్తువును తీసుకురమ్మనో చెబుతుంటారు.అవి చేసే ఆ పనులను ఇంకొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.
తాజాగా ఓ శునకం చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.తమిళనాడుకి చెందిన జాక్ స్పారో అనే కుక్క ఆశ్చర్యపరిచే రీతిలో పనులు చేస్తూ పోతోంది.

జాక్ స్పారో అనబడే ఆ కుక్క షాపింగ్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.తన సొంతంగా తానే షాపింగ్ చేసి ఓనర్ కి కావాల్సినవి జాగ్రత్తగా ఇంటికి తెస్తోంది.షాపింగ్ చేయగా ఆ మిగిలిన డబ్బులను సైతం తెచ్చి తమ యజమానికి ఇస్తోంది.తమిళనాడు లోని దిండిగుల్ జిల్లా పళనిలోని దాస్ ఫెర్నాండెజ్ కుక్క జాక్ స్పారో ఇటువంటి పనులు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
నాలుగు సంవత్సరాల వయసుండే ఆ కుక్క చిన్నప్పటి నుంచే అంగడికి వెళ్లి సరుకులను తెస్తోంది.తన యజమాని అయిన దాస్ ఇచ్చినటువంటి చీటీ ద్వారా అంగడికి వెళ్లి సరుకులు తెస్తోంది.
అది షాపింగ్ చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.కుక్కను చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు.