సాధారణంగా కొందరి ముఖంలో ముప్పై ఏళ్లకే ముడతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి.ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల తక్కువ వయసులోనే చర్మంపై ముడతలు ఏర్పడుతుంటాయి.
ఇవి మనల్ని ముసలి వారీగా చూపిస్తాయి.ముఖంలో కాంతిని దూరం చేస్తాయి.
అయితే వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో ముడతలను వదిలించుకోవచ్చు.ముఖ్యంగా పెసలు ముడతలను మాయం చేయడానికి ఎంతగానో సహాయపడతాయి.
ముఖాన్ని యవ్వనంగా మెరిపిస్తాయి.మరి ఇంతకీ పెసలను( Moong Dal ) చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు స్పూన్లు పెసలు వేసి మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు పెసర పిండి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్( Green tea powder ) వేసుకోవాలి.వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, చిటికెడు ఆర్గానిక్ పసుపు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఇది మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.పెసర పిండి, గ్రీన్ టీ పౌడర్.ఇవి రెండూ యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి.వీటిని వాడడం వల్ల ముడతలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు దూరమవుతాయి.చర్మం యవ్వనంగా మారుతుంది అలాగే పెరుగు స్కిన్ ను తేమగా ఉంచుతుంది.
మృదువుగా మెరిసేలా చేస్తుంది.ఇక పసుపు( Turmeric ) మొటిమలకు చెక్ పెడితే.
రోజ్ వాటర్ చర్మం లో కాంతిని పెంచుతుంది.కాబట్టి ముడతలు మాయమై ముఖం యవ్వనంగా అందంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ సింపుల్ హోమ్ రెమెడీని ఫాలో అయిపోండి.







