వైర‌ల్‌.. రెండు త‌ల‌లతో పుట్టిన గొర్రెపిల్ల‌..

ఈ సృష్టిలో చాలా వ‌ర‌కు వింత జననాల గురించి మ‌నం చూస్తూనే ఉంటాం.

ఒక జాతికి ఎందిన జంతువు మ‌రో జాతికి చెందిన జంతువులాగా పుట్ట‌డం లేదంటే దాని ఆకారంలోనే వింత వింత శిశువులు జన్మించినట్టు వ‌స్తున్న వార్త‌లు చూస్తేనే ఉన్నాం.

ఇలాంటివి సాధార‌ణంగా అడ‌విలో కంటే కూడా మ‌నుషులు నివ‌సించే జ‌నావాసాల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటాయి.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

అయితే అది మ‌న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జ‌ర‌గ‌డంతో ఇంకాస్త వైర‌ల్ అవుతోంది.ఈ జిల్లాలోని ఓ రైతుకు చెందిన గొర్రె రెండు తలలతో ఉన్న గొర్రె పిల్లకు జన్మనివ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాఇంశంగా మారింది.

మామూలుగానే ఇలాంఒటి వార్త‌లు విన‌డానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.మ‌రి ఈ న్యూస్ వైర‌ల్ కాకుండా ఉంటుందా.

Advertisement

ఇప్పుడు ఈ విషయం తెలుసుకుని పక్క గ్రామాల ప్ర‌జ‌లు కూడా దీన్ని చూసేందుకు వ‌స్తున్నారంట‌.జక్రాన్ పల్లి మండల కేంద్రంలో నివాసం ఉండే తొగరి లక్ష్మణ్‏ పెంచుకున్న గొర్రె ఈ విధంగా వింత గొర్రె పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది.

కాగా ఆ పిల్ల‌కు శరీరం, అలాగే కాళ్లు కూడా పూర్తిగా సాధారణ గొర్రె లాగానే ఉన్నాయి.

కానీ తలలు మాత్రం రెండుగా రావ‌డంతో అది వింత గొర్రె పిల్లగా మారిపోయింది.అయితే ల‌క్ష్మ‌ణ్ ఈ విష‌యాన్ని చుట్టు ప‌క్క‌ల వారికి తెలియ‌జేయ‌డంతో వారు అంతా కూడా వ‌చ్చి దీన్ని చూసేందుకు ఎగ‌బ‌డుతున్నారంట‌.పక్క గ్రామాల ప్ర‌జ‌ల‌కు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి చూడటానికి తరలివస్తున్నార‌ని స‌మాచారం.

ఇంకేముంది ఈ విష‌యం కాస్తా అధికారుల వరకు చేర‌డంతో వారు రంగంలోకి దిగారు.వారు వ‌చ్చి ఆ వింత గొర్రె పిల్ల‌ను పరిశీలించి దాన్ని చెక్ చేశారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!

అయితే ఆ గొర్రెపిల్ల మాత్రం జన్యు ప‌ర‌మైన లోపంతోనే ఇలా జన్మించింద‌ని వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు