వైరల్: 6నెలల చిన్నారిని జైలులో పెట్టమంటున్న ఓ కుటుంబం... విషయం ఏమైయుంటుంది!

మీరు విన్నది నిజమే.ఆ చిన్నారి వయస్సు 6 నెలలు మాత్రమే.

అలాంటి ఓ చిన్నారిని జైలుకు పంపించాలంటూ కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు.

దానికోసం చెప్పులరిగేలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు.

అధికారులు కుదరదు అంటే.స్థానిక ఎమ్మెల్యే వద్దకూ వెళ్లి మరీ బతిమిలాడుతున్నారు.

అయితే ఆ కుటుంబ సభ్యుల కోరిక నెరవేర్చడానికి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు.ఎందుకొస్తారు? వారి పిచ్చికపోతే.అయితే ఆ 6 నెలల చిన్నారిని కుటుంబ సభ్యులు ఎందుకు జైలుకు పంపాలనుకుంటున్నారు? అనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా చదవాల్సిందే!.వివరాల్లోకి వెళితే.

Advertisement
Viral A Family Who Wants To Put A 6-month-old Child In Jail What Will Happen ,

ఉత్తరప్రదేశ్‌, చిత్రకూట్ జిల్లాలోని రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానికులు రామ్‌లీలాను వీక్షిస్తుండగా.ఓ యువతి పట్ల ఇద్దరు పోలీసు అధికారులు అసభ్యంగా ప్రవర్తించారు.

దీంతో అధికారులపై అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేకాకుండా ఆ పోలీసులపై దాడి కూడా చేశారు.

ఈ నేపథ్యంలో 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అంతేకాకుండా 7 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఆ 6 నెలల చిన్నారికి జన్మనిచ్చిన మహిళ కూడా ఉంది.

Viral A Family Who Wants To Put A 6-month-old Child In Jail What Will Happen ,
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. పైచేయి సాధించిన అమ్మాయిలు..!

అయితే తల్లి జైలు జీవితం గడపడంతో ఆ 6 నెలల చిన్నారి పాలకోసం తల్లడిల్లిపోతోంది.ఆ వయసులో వారికి తల్లిపాలు తప్ప, ఇంకేవి ఆహారంగా ఇవ్వకూడదు.దాంతో ఆ చిన్నారి ఆకలి కేకలు పెడుతోంది.

Advertisement

ఆ చిన్నారి ఆకలి తీర్చడం.మిగిలిన కుటుంబ సభ్యుల వల్ల కావడం లేదు.దీంతో ఆ అమ్మాయి నానమ్మ.

పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ చిన్నారి బాధను అధికారులకు వివరిస్తోంది.జైలులో ఉన్న తన తల్లి వద్దకు పంపితే.

చిన్నారికి ఆకలి బాధలు ఉండవని చెబుతున్నారు.కానీ అందుకు అధికారులు ఒప్పుకోవడం లేదు.

దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యేను కూడా సంప్రదించారు.అయితే ఆ ఎమ్మెల్యే కూడా ఏమీ చేయలేకపోయాడు.

అయితే దీనిపైన స్పందించిన అధికారులు.కోర్టు ఆదేశాలు ఇస్తే.

చిన్నారిని తన తల్లివద్దకు చేరుస్తామని అంటున్నారు.

తాజా వార్తలు