రాములమ్మ ' రాజకీయం '  ఆమెకైనా అర్థం అవుతోందా ?

విజయశాంతి( Vijayashanti ) అలియాస్ రాములమ్మ రాజకీయం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు.

  ఎంపీగా పోటీ చేసి గెలిచిన విజయశాంతి ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

  తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని రాములమ్మ శపథం చేశారు .కెసిఆర్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.ఆ పార్టీలో చేరగానే 2018 లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా విజయశాంతి బాధ్యతలు స్వీకరించారు.

  అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెంది బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో , కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోలేదు అనే అంచనా తో ఆమె వెంటనే బిజెపిలో చేరిపోయారు .తెలంగాణలో బిజెపి బలోపేతం అవుతున్నట్లుగా పరిస్థితులు కనిపించడంతో , ఆమె ఆ పార్టీలో చేరిపోయారు దీంతో ఆమెకు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా బాధ్యతలు అప్పగించారు .

 ఆ తర్వాత తెలంగాణలో ఆమెకు ఎటువంటి బాధ్యతలు అప్పగించకపోవడంతో తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతూ సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేసేవారు.  ఆ తరువాత బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు దూరంగానే ఉన్నారు.కొంతకాలం క్రితమే ఆమెకు పోరాటాల కమిటీ చైర్మన్ గా బిజెపి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది.

Advertisement

అయినా ఆమె అసంతృప్తి తోనే ఉంటూ వచ్చారు .అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు.ఇటీవల కాలంలో కాంగ్రెస్ బాగా బలోపేతం అవుతుండడం , పెద్ద ఎత్తున ఆ పార్టీలోకి చేరికలు కనిపిస్తూ ఉండడంతో ఆమె బిజెపికి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.నిన్ననే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డ,  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు.  రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానం కేటాయిస్తామని కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతికి హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు