అసలుకే ఎసరులా మారిన దేవరకొండ పరిస్థితి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి లాక్‌డౌన్ విధించిన సంగతి విదితమే.

కాగా ఈ లాక్‌డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారికి ఆహారంతో పాటు నిత్యావసరాలను అందిస్తున్నాయి.

ఇక తెలుగు సినిమా రంగానికి చెందిన పేద కార్మికుల సహాయార్ధం మెగాస్టార్ చిరంజీవి CCC అనే సంస్థను ఏర్పాటు చేసి వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.అటు చాలా మంది సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా ఏదో ఒక సహాయం అందిస్తున్నారు.

కాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తనపేరు మీద ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు.అయితే ఈ ఫౌండేషన్‌కు అభిమానుల దగ్గర్నుండి రూ.35 లక్షలు వసూలు కాగా, తన సొంతంగా రూ.25 లక్షలు అందజేశాడు.మొత్తం రూ.60 లక్షలతో నిరుద్యోగులకు రూ.1000 చొప్పున పంచేందుకు సిద్ధమయ్యాడు.అయితే విజయ్ దేవరకొండకు వచ్చిన అప్లికేషన్‌లు మొత్తం 57,460 అని తేలింది.

వారందరికీ సాయం అందించాలంటే ఈ మొత్తం సరిపోదని తెలుస్తోంది.దీనికి ఎంతలేదన్నా మరో రూ.5 కోట్లు కావాల్సి ఉంది.మరి ఇంత భారీ మొత్తాన్ని విజయ్ దేవరకొండ సర్ధుబాటు చేయగలడా లేక వచ్చినదానితో కొంత మందికి సాయం చేస్తాడా అనేది చూడాలి.

Advertisement
నీకు ఆఫర్లు లేకుండా చేస్తామంటూ జబర్దస్త్ రాకేశ్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. ఏమైందంటే?

తాజా వార్తలు