పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ఏం అన్నాడంటే?

టాలీవుడ్ హీరో అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అతి తక్కువ కాలంలోనే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకున్న వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు.

విజయ్ దేవరకొండ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టాక్సీ వాలా, వరల్డ్ ఫేమస్ లవర్, ద్వారక, గీత గోవిందం, ఇలాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా మనందరికీ సుపరిచితమే.ఇతను దొరసాని అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఆనంద్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం పుష్పకవిమానంఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తోంది.ఈ సినిమాకు దామోదర దర్శకత్వం వహించగా, విజయ్ దేవరకొండ నిర్మించారు.

Advertisement

ఈ సినిమాలు అమాయకుడైన యువకుడి పాత్రలో నటిస్తున్నాడు.

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్,విజయ్ కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.ఇందులో అమ్మ ఫేవరెట్ ఎవరు అనే ప్రశ్నకు నేనంటూ ఇద్దరు చేతులు లేపారు.ఇక తన కంటే ముందుగా తన తమ్ముడికి మ్యారేజ్ అవుతుందని విజయ్ దేవరకొండ తెలిపాడు.

అప్పుడు ఆనంద్ తనకి కాదు విజయ్ కే అంటూ సైగ చేశాడు.ఇక చదువుకునే ఈ రోజుల్లో సమ్మర్ హాలిడేస్ కి ఇంటికి వచ్చే వాళ్ళని, అప్పుడు చిన్ని సోదరుడు చుక్కలు చూపించే వాడిని రౌడీ చెప్పుకొచ్చాడు.

ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో నీ విజయ్ దేవరకొండ యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు