వినాయక చవితి సందర్భంగా ''విద్య వాసుల అహం'' మూవీ ఫస్ట్ లుక్ , టైటిల్ విడుదల !!!

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతున్న సినిమా విద్య వాసుల అహం షూటింగ్ దశలలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ , యానిమేషన్ కాన్సెప్ట్ వీడియో వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు.

టైటిల్ మరియు లుక్ ఫ్రెష్ గా ఉన్నాయని ముఖ్యంగా యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది.

కాన్సెప్ట్ వీడియోకు అన్ని వర్గాల ఆడియన్స్ నుండి మంచి స్పందన లభిస్తోంది.తెల్లవారితే గురువారం సినిమా తరువాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం ఒక ఇల్లు సెట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యడం జరిగింది.పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో లతో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది.

కల్యాణి మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విద్య వాసుల అహం త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.

Advertisement

నటీనటులు:

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ సాంకేతిక నిపుణులు: చిత్రం: విద్య వాసుల అహం, బ్యానర్: ఏటిర్నిటీ ఎంటర్టైన్మెంట్, సంగీతం: కల్యాణి మాలిక్ దర్శకత్వం: మణికాంత్ గెల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేష్ దత్త మోటూరు, నిర్మాత: లక్ష్మీ నవ్య మక్కపాటి & రంజిత్ కుమార్ కొడాలి, రచన: వెంకటేష్ రౌతు, ఎడిటర్: సత్య గిడుటూరి.

వీడియో వైరల్ : అసలు బుద్ది ఉందా లేదా.. రీల్స్ కోసం ఇలా అవసరమా..
Advertisement

తాజా వార్తలు