డర్టీ పిక్చర్ చూసి మా పేరెంట్స్ అలా అంటారనుకోలేదు... కానీ

సినిమా అనేది రంగుల ప్రపంచం ఈ రంగుల ప్రపంచంలో రాణించాలంటే ఎన్నో అవమానాలు, అభినందనలు, విమర్శలు, ప్రసంశలు ఇలా అన్నింటిని ఎదుర్కొని నిలబడడానికి సిద్ధంగా ఉండాలి.

ముఖ్యంగా మనం ఏదైనా ఓ పాత్రలో నటించడానికి సిద్ధపడినప్పుడు ఒక్కోసారి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అయితే 2011వ సంవత్సరంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మిలన్ లుతిరా దర్శకత్వం వహించిన ది డర్టీ పిక్చర్ చిత్రం దేశ వ్యాప్తంగా మంచి విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.అంతేకాకుండా ఈ చిత్రం దర్శకనిర్మాతలకు కూడా కాసుల వర్షం కురిపించింది.

కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ స్వర్గీయ నటి సిల్క్ స్మిత జీవితగాధ ఆధారంగా తెరకెక్కించడంతో ఈ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన విద్యాబాలన్ కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.అంతేకాకుండా అప్పటివరకు పెద్దగా హిట్లు లేక చప్పగా సాగుతున్న విద్యాబాలన్ కెరియర్ ఒక్కసారిగా వరుస సినిమా అవకాశాలతో ఊపందుకుంది.

అయితే తాజాగా ఈ చిత్రంలో తన నటనా తీరుని చూసి తన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని విద్యాబాలన్ పేర్కొంది.అంతేకాకుండా తాను ఈ చిత్రంలో కొంతమేర బోల్డ్ తరహా దుస్తులు ధరించి నటించినప్పటికీ తన తల్లిదండ్రులు మాత్రం కేవలం తన నటనా తీరుని మరియు ప్రతిభని చూసి చప్పట్లు కొట్టారని అందుకు తనకు ఎంతో సంతోషంగా అనిపించిందని తెలిపింది.ఒక నటిగా తన తల్లిదండ్రుల నుంచి మంచి ప్రశంసలు అందుకోవడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Advertisement

ఇక తాను నటిగా ఉన్నప్పుడు ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉండాలని అంతే కాకుండా తన పాత్రకి తగిన న్యాయం చేయడానికి మించిన అవార్డు మరొకటి లేదని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో విద్యాబాలన్ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.

అంతేకాకుండా ఆ మధ్య ఈ అమ్మడు నటించిన "మిషన్ మంగళ్, శకుంతలా దేవి" తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాయి.దీంతో ప్రస్తుతం నటి విద్యాబాలన్ శేర్ని" అనే హిందీ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.

ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు "అమిత్ మసుర్ కార్" దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు