వీడియో వైరల్: ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ.. పాములా కుబుసం విడుస్తున్న ఈ జీవిని చూసారా..

ప్రకృతిలో అనేక జీవరాసులు నివసించడం అందరికీ తెలిసిన విషయమే.ఇందులో ఒక్కొక్క జీవుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

విష జీవులలో ఒకటి అయిన పాము( snake ) ఎలాగైతే చర్మాన్ని విడుస్తుందో అందరికి తెలిసిన విషయమే.అలాగే ఊసరవెల్లి రంగులు మార్చడం కూడా అందరికీ తెలిసిందే.

కానీ మీరు ఎప్పుడైనా జర్రీ పాములాగా చర్మం కుబసంలా విడుస్తు, అలాగే ఊసరవెల్లి లాగా రంగులు మార్చడం చూశారా.? అయితే తాజాగా ఇలాంటి ఒక జర్రీ ఊసరవెల్లి( Chameleon ) లాగ రంగులు మార్చడంతో పాటు చర్మం విడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా జర్రీ( Centipedes ) మన ఇంటి పరిసర ప్రాంతాలలో చూస్తూనే ఉంటాం.ఒకవేళ జర్రీ కరిస్తే మాత్రం ఎటువంటి ప్రాణహాని ఉండదు కానీ., నొప్పి మాత్రం ఉంటుంది.

Advertisement

కాకపోతే., కొన్ని సందర్భాలలో కొంతమందికి అయితే ఎలర్జీ రావడం కూడా మనం చూసాము.

ప్రసతుతం ఇలా రెండు గుణాలున్న జర్రి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా జర్రీ సాధారణంగా గోధుమ రంగులో ఉంది.ఆ తర్వాత నెమ్మదిగా తన చర్మాన్ని తాను తొలగించుకుంటూ పాములాగా కుబుసం విడుస్తున్నట్లు జర్రీ తన రంగును పూర్తిగా మార్చుకోవడం మనం గమనించవచ్చు.ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ ఇలాంటి జర్రిని మునుపేపుడు చూడలేదు అంటూ కామెంట్ చేస్తూ ఉంటే.

మరికొందరు అయితే ఇది పాము కంటే ఎక్కువ ప్రమాదంలాగా ఉందని కామెంట్ చేస్తున్నారు.

షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..
Advertisement

తాజా వార్తలు