ఇటీవల ఏపీ అధికార పార్టీగా మారిన టిడిపి గత జగన్ ప్రభుత్వ తాలూకా నిర్ణయాలు, పథకాల పేర్ల మార్పు విషయంలో కీలకంగా వ్యవహరిస్తోంది.ముఖ్యంగా గత వైసిపి ప్రభుత్వంలో జగన్ ప్రవేశపెట్టిన పథకాలకు ఎక్కువగా జగన్ పేరుతో పాటు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేర్లు పెద్దడంతో ఇప్పుడు వాటి పేర్లను మార్చేందుకు శ్రీకారం చుట్టారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే విధంగా ముందడుగు వేస్తూనే, ఆయా పథకాలకు పేర్లు మార్చే వ్యవహారానికి శ్రీకారం చుట్టారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లను నాలుగువేలకు పెంచుతూ .చంద్రబాబు( Chandrababu Naidu ) నిర్ణయం తీసుకున్నారు.జులై ఒకటి నుంచి పెరిగిన పెన్షన్లను పంపిణీ చేయనున్నారు.
వైయస్సార్ పెన్షన్ కానుక పేరుతో ఇస్తున్న దానిని ఎన్టీఆర్ భరోసాగా మార్చుతూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీంతోపాటు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసిన అన్న క్యాంటీన్( TDP Anna Canteen ) లను తిరిగి ప్రారంభించేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు.
వీటిపైనా సంతకాలు చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల్లో 2003 అన్న క్యాంటీన్ల ఏర్పాటు దిశగా సిద్ధమవుతున్నారు.అలాగే గత వైసిపి ప్రభుత్వం( YCP Govt ) ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.కలెక్టర్లు, ఎస్పీలు ,కార్పొరేషన్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేవారు.
అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ కార్యక్రమం పైన నిర్ణయం తీసుకున్నారు.
స్పందన పేరును ”పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ డ్రెస్సెల్ సిస్టం ” గా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.యధావిధిగా ప్రతి సోమవారం ఈ కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.అసెంబ్లీ సమావేశాల్లో హెల్త్ వర్సిటీ పేరు మార్పుతో పాటు, స్కీం ల పేర్ల మార్పు పైన నిర్ణయాలు తీసుకోమన్నారు.
రాజధాని అమరావతి, పోలవరం, ఉపాధి కల్పన, సంక్షేమం ప్రాధాన్య అంశాలుగా పరిపాలనను సాగించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.