వైరల్: ఇదేం వింత నాయనో.. ఆకాశంలో ఇద్దరు సూర్యుళ్ళు, మిస్టరీ ఇదేనట!

ఇక్కడ ఒక్క సూర్యుని వెలుగుకే జనాలు తట్టుకోలేక పోతున్నారు, ఇంకా రెండో సూర్యుడా? ఇక మనిషి బతికే అవకాశం వుందా? అని ఆలోచిస్తున్నారు కదూ.

వాస్తవానికి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడటానికి ఎంతో అందంగా, ఆహ్లాదంగా వుంటాయి.

ఆ అద్భుత దృశ్యాల్ని వర్ణించేందుకు భాష సరిపోదంటే అతిశయోక్తి కాదు.అయితే మిట్టమధ్యాహ్నం మాత్రం సూర్యుడిని( Sun ) కన్నెత్తి చూడడం దాదాపుగా ఎవరికైనా అసాధ్యం.

కాంతి తీవ్రతను తట్టుకోవడం ఎవరి వల్లా కాదు.ఇక ఏ సమయంలో చూసినా మనకు ఆకాశంలో ఒకటే సూర్యుడు కనిపిస్తాడు.

Video Of Two Suns In The Sky Goes Viral Details, Viral Latest, News Viral, Soci

అయితే ప్రస్తుతం ఆకాశంలో రెండు సూర్యుళ్లు( Two Suns ) కనువిందు చేస్తున్న దృశ్యం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.వీడియో నిజమైనదిగానే అనిపిస్తున్నా ఇదేలా సాధ్యమైందో అర్థంకాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్న పరిస్థితి.అయితే, కొందరు విజ్ఞులు దీనిపై స్పందించి మిస్టరీకి ( Mystery ) తెరదించారు.

Advertisement
Video Of Two Suns In The Sky Goes Viral Details, Viral Latest, News Viral, Soci

ఇంతకీ విషయం ఏమిటంటే ఓ వ్యక్తి రెండు సూర్యుళ్లను తిలకించేందుకు సముద్రంపైకి వెళ్లాడు.ఆ దృశ్యాన్ని వీడియో తీసి నెట్టింట షేర్ చేయడంతో జనాలు ఆ దృశ్యాల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.

Video Of Two Suns In The Sky Goes Viral Details, Viral Latest, News Viral, Soci

అతగాడు ఈ నేపధ్యంలో 2 సూర్యుళ్లను చూసేందుకు సముద్రయానానికి( Ocean ) వెళుతున్నానంటూ ఓ వీడియోను షేర్ చేశాడు.అతడు చెప్పినట్టే, ఆకాశంలో పొద్దువాలుతున్న సమయంలో కనిపించే సూర్యుడి మాదిరి రెండు ఆకారాలు ఆకాశంలో కనిపించాయి.అంతే ఇక.భూమ్మీద ఇలాంటివి కూడా జరుగుతుంటాయా అంటూ కొందరు ఆశ్చర్యపోయారు.కాగా విజ్ఞులు స్పందించి మిస్టరీకి తెరదించారు.

వాస్తవానికి ఆ వీడియోలో కనిపిస్తున్న వాటిల్లో ఒకటి నిజంగానే సూర్యుడు కాగా మరొకటి చంద్రుడు.( Moon ) కాకపోతే, ఆ ప్రాంతంలో సూర్యకిరణాలు ఏటవాలుగా పడటంతో చంద్రబింబం ఎర్రని కాంతితో మెరిసిపోతూ రెండో సూర్యుడిలా కనిపించిందని తెలిపారు.

ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్
Advertisement

తాజా వార్తలు