ఏటీఎం ఎలా వాడాలో తల్లికి చెప్పిన పాకిస్థానీ మహిళ.. వీడియో వైరల్...

ఈ రోజుల్లో డిజిటల్ బ్యాంకింగ్ ( Digital banking )వాడటం అందరికీ ఉపయోగకరంగా ఉంది.

వయసు పైబడిన వారికి ఈ డిజిటల్ వాడకం అనేది చాలా కొత్తగా, అలాగే ఆసక్తికరంగా కనిపిస్తోంది.

అయితే పెద్దగా చదువుకోని వాళ్లు వాటిని వాడడానికి కష్టపడుతున్నారు.అదే సమయంలో చాలా సింపుల్‌గా పూర్తయ్యే పనులను చూసి ఫిదా అవుతున్నారు.

వారు కొత్త టెక్నాలజీని వాడడానికి మొదటిగా ఎలా కష్టపడుతున్నారో చూపించే వీడియోలు అడపాదడపా వైరల్ అవుతున్నాయి.తాజాగా ఓ పాకిస్థాన్ ( pakistan )మహిళకు సంబంధించిన వైరల్ అయ్యింది.

ఆ వీడియోలో ఓ అమ్మాయి తన తల్లికి మొదటిసారి ఏటీఎం ఉపయోగించడం నేర్పిస్తోంది.వీడియో మొదట్లో, కాస్త ఆందోళన భయంగా తల్లి కనిపిస్తుంది.

Advertisement
Video Of Pakistani Woman Telling Mother How To Use ATM Goes Viral, Viral News, L

ఆమె ఏటీఎం దగ్గర నిలబడి ఉంటుంది.కార్డు ఎలా ఇన్‌సెర్ట్ చేయాలో ఆమెకి తెలియదు.

కానీ, పక్కనే ఉన్న ఆమె కూతురు, ఈ ఉర్దూలో మొత్తం వీడియో తీస్తూ, ప్రతి స్టెప్ ని చాలా క్లుప్తంగా తల్లికి చెబుతోంది.ఆ తల్లి జాగ్రత్తగా వింటుంది, కూతురు చెప్పినట్లు చేస్తుంది.

ఆమెకు భయం ఉన్నా, కరెక్ట్ గా నేర్చుకోవాలనే పట్టుదల కూడా ఉంటుంది.

Video Of Pakistani Woman Telling Mother How To Use Atm Goes Viral, Viral News, L

ఎట్టకేలకు డబ్బులు బయటికి వచ్చాక ఆమె లెక్కపెట్టడం మొదలు పెడుతుంది.అప్పుడు కూతురు ఎందుకు లెక్కిస్తున్నావ్ అని అడుగుతుంది.దానికి ఆ తల్లి, డబ్బు సరిగ్గా వచ్చాయో లేదో చూసుకోవాలి కదా అని చెబుతుంది.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
ప్రజలను కొట్టడానికి దూసుకెళ్లిన రోబొ.. వీడియో వైరల్

ఇలా జాగ్రత్తగా లెక్కించడం చూస్తే, బ్యాంకింగ్ విషయం ఆమెకి ఎంత కొత్తగా ఉందో అర్థమవుతోంది కదా! చాలామంది ఆమె అమాయకత్వాన్ని చూసి నవ్వుకుంటున్నారు.

Video Of Pakistani Woman Telling Mother How To Use Atm Goes Viral, Viral News, L
Advertisement

ఈ వీడియో ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన హ్యాపీ మూమెంట్స్‌ను క్యాప్చర్ చేస్తానని కొందరు పేర్కొన్నారు.ఈ వీడియోను @madiha.rajpoot2 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేశారు.వీడియో చూసిన వాళ్ళందరూ చాలా ఇష్టపడ్డారు.

ఓ మధ్య తరగతి కుటుంబీకులే ఈ సందరంలోని విశేషం అర్థం చేసుకోగలరు అని ఆ పోస్ట్‌లో రాశారు.ఇప్పటివరకు ఈ వీడియోకు 30 లక్షలకు పైగా వ్యూస్, 1 లక్షకు పైగా లైకులు వచ్చాయి.

ఇంకా చాలా మంది వీడియో చూసి కామెంట్స్ పెడుతున్నారు.వీడియో చూశాక చాలా ఆనందంగా అనిపించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

డబ్బులు తీసాక ఆ అమ్మ ఏటీఎంకు హిందీలో ధన్యవాదాలు అని చెప్పడం చాలా బాగుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.తాము కూడా తమ తల్లిదండ్రులకు ATM వాడకం నేర్పించినప్పుడు ఇలాంటి అనుభవమే జరిగిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియో చూసి చాలా మందికి మంచి ఫీలింగ్ కలిగింది.

తాజా వార్తలు