ఆ హీరోయిన్ తో ఎఫైర్ అంతా ట్రాష్ అంటున్న హీరో

బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్, డేటింగ్ సర్వ సాధారణ విషయం.

ఎవరు ఎప్పుడు ఎవరితో రిలేషన్ లో ఉంటారనేది కాస్తా కన్ఫ్యూజన్ గా ఉంటుంది.

ఎవరూ ఎక్కువ కాలం రిలేషన్ లో ఉండరు.ఒక వేళ రిలేషన్ లో ఉంటే మాత్రం పెళ్లి చేసుకొని ఒకటైపోతారు.

అలా పెళ్లి చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి.అమితాబచ్చన్, జయాబచ్చన్ నుంచి ఈ జెనరేషన్ లో రణవీర్ సింగ్, దీపికా పదుకునే వరకు చాలా మంది రిలేషన్ షిప్ లో ఉంటూ పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్స్ కావడం విశేషం.

అలాగే ప్రస్తుతం అలియా భట్, రణబీర్ సింగ్ రిలేషన్ బిటౌన్ లో మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పాలి.అలాగే మరికొందరు హీరోయిన్స్ కూడా తమ సహచర హీరోలతో డేట్ లో ఉంటున్నారు.

Advertisement

ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈ మధ్య యంగ్ హీరో విక్కీ కౌశల్ తో కలిసి రెండు, మూడు పార్టీలలో కనిపించే సరికి వారి మధ్య రిలేషన్ నడుస్తుందని, డేటింగ్ లో ఉన్నారంటూ బిటౌన్ మీడియా హడావిడి చేసింది.అయితే దీనిపై తాజాగా హీరో విక్కీ కౌశల్ క్లారిటీ ఇచ్చాడు.

కత్రినతో అఫైర్ వార్తలపై మ్యాగజైన్ ఇంటర్వ్యూలో అతనికి ప్రశ్న ఎదురైంది.దానికి అతను క్లారిటీ ఇవ్వడంతో మీడియాకి ఫుల్ క్లాస్ పీకాడు.

అసలు వ్యక్తిగత జీవితం బహిరంగా చర్చించుకుంటే అది వారిని తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఎదుటి వారి జీవితాలలోకి తొంగి చూసేటపుడు ఒకటికి రెండు సార్లు క్రాస్ చెకింగ్ చేసుకొని వార్తలు రాయడం మంచి పద్ధతి.

అలా కాకుండా ఇష్టానుసారంగా కథనాలు ప్రచారం చేయడం వలన వారి జీవితాలు ఇబ్బందికరంగా మారుతాయి.అందుకే గాసిప్స్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని డిసైడ్ అయ్యాను అని విక్కీ కౌశల్ చెప్పుకొచ్చాడు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

కత్రినతో స్నేహం చేశానని కానీ మీడియాలో దానిని తప్పుడు మార్గంలో ప్రచారం చేశారని, అసలు అందరూ అనుకుంటున్న రిలేషన్ తమ మధ్య లేదని అదంతా కేవలం గాసిప్ మాత్రమేనని తేల్చేశాడు.

Advertisement

తాజా వార్తలు