మామూలుగా తరచూ సెలబ్రిటీలకు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.సెలబ్రిటీలు ఎలాంటి చిన్న పని చేసినా కూడా అదే భూతద్దంలో పెట్టి చూసి దాని పెద్దదిగా చేస్తూ ఉంటారు.
అలా తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.తాజాగా శృతిహాసన్ ( Shruti Haasan ) చేసిన పనికి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ శృతిహాసన్ ఏం చేసింది అన్న వివరాల్లోకి వెళితే.ఈ మధ్య కాలంలో వార్తలు ఎక్కువగా నిలుస్తున్న వారిలో హీరోయిన్ శృతిహాసన్ కూడా ఒకరు.
ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ మంచి ఊపు మీద ఉన్న శృతిహాసన్ గత కొద్దిరోజులుగా తన బాయ్ ఫ్రెండ్ లవ్ బ్రేకప్ విషయంలో ఎక్కువగా వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్( Shruti Haasan Breakup ) చేసుకున్నట్లు వార్తలు వైరలయ్యాయి.అయితే ఈ విషయంపై శృతిహాసన్ ఇప్పటి వరకూ స్పందించలేదు.తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు.కానీ ఆమె చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.శృతి హాసన్ ప్రస్తుతం ముంబాయిలో( Mumbai ) ఉంటున్నారు.
అక్కడే ఒక మూవీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
అయితే షూటింగ్‌కు బయలుదేరిన ఆమె ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.అది ఎంతసేపటికీ క్లియర్ కాకపోవడంతో.షూటింగ్‌కు ఆలస్యం అవుతుందని శృతిహాసన్ తాను వెళుతున్న కారును పక్కన నిలిపేసి ఆటో ( Auto ) ఎక్కి వెళ్లిపోయారు.
అయితే ఆమె ఆటోలో వెళుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.శృతిహాసన్ ఏ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారో తెలియదు ఆమె చేసిన పనికి ఆమె సింప్లిసిటీ ఫిదా అవుతున్నారు.