మహారాష్ట్రలోని అమ్రావతి బీజేపీ ఎంపీ అభ్యర్థి నవనీత్ కౌర్ పై( Navneet Kaur ) కేసు నమోదైంది.ఈ మేరకు తెలంగాణలోని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో( Shadnagar Police Station ) కేసు నమోదు చేశారు.
షాద్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్ కాంగ్రెస్ పై ( Congress ) అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే పాకిస్తాన్ కు వేసినట్లేనని నవనీత్ కౌర్ వ్యాఖ్యానించారు.
కాగా నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా పరిగణించింది.ఈ క్రమంలో ఈసీ ఆదేశాల మేరకు షాద్ నగర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.