మా అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం.. కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో తీర్మానం

గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రమేయం వుందంటూ ప్రైవేట్ మెంబర్ మోషన్‌ను కెనడా హౌస్ ఆఫ్ కామన్స్( Canada House Of Commons ) ఆమోదించింది.“Political Interference, Violence or Intimidation on Canadian Soil” అనే మోషన్‌ను ఫిబ్రవరి 12న ఇండో కెనడియన్ ఎంపీ సుఖ్ ధాలివాల్( Indo-Canadian MP Sukh Dhaliwal ) ప్రవేశపెట్టారు.

 House Of Commons Passes Motion On Foreign Interference In Canada Internal Affair-TeluguStop.com

దీనిని 8 మంది ఇండో కెనడియన్లు సహా పలువురు ఎంపీలు సమర్ధించారు.దీనికి అనుకూలంగా 326 ఓట్లు పోలవ్వగా.

ఏ ఒక్కరూ వ్యతిరేకించకపోవడం గమనార్హం.కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో,( PM Justin Trudeau ) పలువురు కేబినెట్ మంత్రులు, ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలీవ్రేలు( Pierre Poilievre ) కూడా అనుకూలంగా ఓటు వేశారు.

Telugu Canada, Canadainternal, Canadapm, Hardeepsingh, Indocanadian-Telugu NRI

‘‘ కెనడియన్ గడ్డపై ఒక ప్రార్థనా స్థలంలో కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, దీని వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం వుందన్న ఆరోపణలు సహా ఇటీవలి సంఘటనలను గుర్తించాలని సభ కోరుతోంది.భారత్, చైనా, రష్యా, ఇరాన్, ఇతర దేశాల నుంచి పెరుగుతున్న బెదిరింపులు ఈ విదేశీ జోక్యానికి ఉదాహరణలు ’’.అని తీర్మానంలో పేర్కొన్నారు.మరోవైపు.

ఈ తీర్మానంపై ధాలివాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.మా ప్రజాస్వామ్య సంస్థలను అణగదొక్కడం, హింసాత్మక చర్యలలో పాల్గొనడం లేదా కెనడాలోని డయాస్పోరా కమ్యూనిటీలను భయపెట్టడం వంటి వెనుక విదేశీ జోక్యం( Foreign Interference ) లేదా వ్యక్తి లేదా ఏజెంట్లనైనా ఈ తీర్మానం పరిగణనలోనికి తీసుకుంటుంది అని ధాలివాల్ పేర్కొన్నారు.

Telugu Canada, Canadainternal, Canadapm, Hardeepsingh, Indocanadian-Telugu NRI

ఈ ప్రతిపాదనను ప్రముఖ ఇండో – కెనడియన్ సంస్థ, కెనడా ఇండియా ఫాండేషన్ (సీఐఎఫ్) వ్యతిరేకించింది.గత నెలలో ధాలివాల్‌కు రాసిన లేఖలో .ఈ మోషన్‌ ఆమోదించబడితే కెనడా – భారత్ మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని హెచ్చరించింది.ద్వైపాక్షిక సమస్యలు పరిష్కరించబడాలని ఆసక్తితో వున్న సంస్థగా, హింసాత్మక మైనారిటీ అసమాన ప్రభావం దేశ రాజకీయాలు, విదేశాంగ విధానంపైనా చూపుతుందని సీఐఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube