కేజిఎఫ్ డైరెక్టర్ వీరప్పన్ లాంటివాడు.. ప్రశాంత్ నీల్ పై వర్మ షాకింగ్ కామెంట్స్!

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్.

ఈ సినిమా సీక్వెల్ చిత్రంగా విడుదలైనటువంటి కేజిఎఫ్ చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో పలువురు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ క్రమంలోనే వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కేజిఎఫ్ డైరెక్టర్ పై తనదైన శైలిలో కామెంట్ చేశారు.బుధవారం దర్శకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ విధంగా వరుస ట్వీట్లు చేసిన వర్మ కేజిఎఫ్ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు.ప్రశాంత్ నీల్ నువ్వు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఒక వీరప్పన్ లాంటి వాడివి, కేజిఎఫ్ సినిమాతో కేవలం కన్నడ పరిశ్రమకు మాత్రమే కాకుండా భారతీయ చలన చిత్రాలలో పనిచేస్తున్న దర్శకుల మనసును కొల్లగొట్టినందుకు దర్శకుల దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వర్మ ప్రశాంత్ నీల్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం వర్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కేజిఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాతో బిజీగా ఉన్నారు.ఇకపోతే కేజిఎఫ్ చాప్టర్ 2 విజయవంతం కావడంతో కేజిఎఫ్ చాప్టర్ 3 కూడా ఉంటుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

Advertisement

అయితే ఈ వార్తలపై ఎంతోమంది చిత్రబృందం స్పందిస్తూ కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందని చెప్పినప్పటికీ ఇంకా ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

షియోమి/ రెడ్ మీ మొబైల్స్ లో మీకు పనికివచ్చే 7 రహస్య ట్రిక్స్
Advertisement

తాజా వార్తలు