తెలుగు సినీ ప్రేక్షకులకు అక్కినేని హీరో నాగార్జున( Akkineni Nagarjuna ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో ఎన్నో సినిమాలలో నటిని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు నాగార్జున.
ముఖ్యంగా తన అందంతో మన్మధుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఐదు పదుల వయసులో కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తున్నారు నాగార్జున.
ఇకపోతే నాగార్జున కెరియర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో శివమణి సినిమా కూడా ఒకటి.పూరి జగన్నాథ్( Puri Jagannath ) దర్శకత్వం వహించిన సినిమాలో అక్కినేని నాగార్జున, ఆసిన్, రక్షిత ప్రధాన పాత్రల్లో నటించారు.
వైష్నో అకాడమీ బ్యానర్( Vaishno Academy Banner ) పై పూరీ నిర్మించిన ఈ సినిమా 2003లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అప్పట్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.ఇప్పటికీ ఈ సినిమా టీవీలలో వస్తే అతుక్కుని చూసేవారు చాలామంది ఉన్నారు.అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఈ సినిమా నిజానికి నాగార్జున చేయాల్సింది కాదట.
ముందుగా ఈ సినిమా స్టోరీని విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) కోసం రాసుకున్నారట పూరి జగన్నాథ్.వెంకటేష్ కి ఫస్ట్ స్టాప్ అంతా బాగా నచ్చినప్పటికీ సెకండ్ హాఫ్ కాస్త నచ్చలేదట.
ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సినిమాలాగా.సెకండ్ హాఫ్ మొత్తం మరో సినిమాలాగా అనిపిస్తుందని చెప్పాడట.
అయితే కథలో మార్పులు చేసేందుకు స్కోప్ లేకపోవడంతో వెంకీ ఈ సినిమాకు నో చెప్పారట.ఆ తర్వాత కొన్నాళ్లకు ఇదే కథను నాగార్జునకు చెప్పగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.ఆ విధంగా నాగార్జున పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో శివమణి( Shivamani ) సినిమా పూర్తి అయ్యి ఇద్దరికి కెరియర్ లోను వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా నిలిచింది.అప్పట్లోనే ఈ సినిమా దాదాపు 14 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది.
అయితే వెంకీ చెప్పినట్లుగానే ఫస్ట్ హాఫ్ సైతం జనాలకు తెగ నచ్చిందట ఆ తర్వాత సెకండ్ హాఫ్ పై మిక్స్డ్ టాక్ వచ్చింది.