ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతిపక్ష పార్టీ కుట్రలకు తెరతీసింది.అధికార పార్టీపై, నేతలపై బురద రుద్ది రాజకీయ లబ్ది పొందాలని భావిస్తుందని తెలుస్తోంది.
రాజకీయాల్లో 45 ఇయర్ ఇండస్ట్రీ, దేశంలోని సీనియర్ పొలిటీషయన్ ను అంటూ చెప్పుకుని తిరిగే విపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని తానే చేశాను.సాధించాను అంటూ చెబుతుంటారు.
రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ది చేసిన తాను ఏదైనా తన వలనే సాధ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.అయితే చంద్రబాబు గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఆయన రాజకీయ చరిత్ర అంతా వెన్నుపోట్లు, కుట్రలు,కుతంత్రాలు మరియు దిగజారుడుతనాలతో నిండిపోయిందని విమర్శలు గుప్పిస్తున్నారు.
2019వ సంవత్సరంలో వైఎస్ జగన్ చేతిలో టీడీపీ ఘోర పరాభవం చెందింది.దీంతో అక్కసు వెళ్లగక్కేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రారంభించారని అనేక మాటలు వినిపిస్తున్నాయి.
అదే క్రమంలో ఈసారి కూడా సీఎం జగన్ ను ఎదుర్కొలేమని, ప్రజా క్షేత్రంలో మరోసారి ఓటమి తప్పదని భావిస్తున్న టీడీపీ నీచ రాజకీయాలు పరాకాష్టకు చేరాయని కొందరు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
గత కొన్నాళ్లుగా స్వాతిరెడ్డి పేరుతో ఓ మహిళ సీఎం జగన్ పై, ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తోంది.
ఆమెకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు ధీటుగా బదులు ఇవ్వడంతో తన చేస్తున్న దుష్ఫ్రచారాన్ని మరింతగా పెంచింది.తాను యూకేలో నివాసం ఉంటానంటున్న సదరు మహిళ ఏపీ ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ తనను ఏం చేయలేరంటూ ఇష్టారీతిన అనుచిత పోస్టులు పెట్టింది.
అయితే ఇటీవల కాలంలో బలం పుంజుకుంది వైసీపీ సోషల్ మీడియా.ఈ క్రమంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, అభిమానులు తమ నాయకునిపై, ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్న స్వాతిరెడ్డి అనే మహిళకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు.
దీంతో వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియాను ఎదుర్కొలేమని భావించి.వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై, మహిళా మంత్రులపై అసభ్యకరంగా పోస్టులు చేయించారు.కానీ స్వాతిరెడ్డి చేస్తున్న విష ప్రచారం వెనుక చంద్రబాబు ప్రమేయం ఉందని ఎవరూ భావించలేదు.ఆమె టీడీపీ మీద అభిమానంతోనే ఇలాంటి పోస్టులు పెడుతోందని అనుకున్నారు.
కానీ నాలుగు రోజుల క్రితం స్వాతిరెడ్డి సీఎం వైయస్ జగన్ కుటుంబ సభ్యులపై అత్యంత అసభ్యకరంగా ట్విట్టర్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేసిందని సమాచారం.
వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా అనుచిత పోస్టులకు గట్టిగా సమాధానం చెప్పడంతో.
మహిళనని చూడకుండా తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ విక్టిమ్ కార్డ్ బయటకు తీసింది.ఇన్నాళ్లు సాటి మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టిన స్వాతిరెడ్డికి తన దాకా వచ్చేసరికి ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే స్వాతిరెడ్డికి తీరని అన్యాయం జరిగిపోయినట్టుగా రెండు రోజుల నుంచి టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో ఆమెకు అండగా నిలుస్తున్నామని పోస్టులు పెడుతున్నారు.తాజాగా చంద్రబాబు కూడా స్వాతిరెడ్డికి అండగా నిలుస్తానని చెప్పడంతో విషయం బయట పడింది.
ఇన్ని రోజులుగా చంద్రబాబు ఆదేశాలతోనే స్వాతిరెడ్డి ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెడుతోందని నెటిజన్లు భావిస్తున్నారు.దీంతో చంద్రబాబు, స్వాతిరెడ్డిల తీరును వారు ఎండగడుతున్నారు.
ప్రజాక్షేత్రంలో తేల్చుకునే సత్తా లేక చివరికి చంద్రబాబు ఇలాంటి నీచానికి దిగజారాడని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఇటువంటి చర్యలకు ప్రచారాలకు టీడీపీ అడ్డుకట్ట వేస్తుందో లేదోనన్నది వారి విజ్ఞతకే వదిలేయ్యాలంటూ ఏపీ ప్రజలు అంటున్నారని సమాచారం.







