వెంకటేష్ కి అడ్డం పడుతున్న రజినీకాంత్

చాలా కాలం తరవాత రీమేక్ కాని , సోలో సినిమా ఒకటి చేసాడు వెంకటేష్.మారుతి ని డైరెక్టర్ గా ఎంచుకుని బాబు బంగారం సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు ఉండగా టీజర్ విడుదల తరవాత మంచి బిజినెస్ చేస్తోంది.నయనతార హీరోయిన్ అవ్వడం తో తమిళం లో ఈ సినిమాని విడుదల చెయ్యాలని చూస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదల విషయం లో రజినీకాంత్ అడ్డం పడుతున్నాడు వీరికి.రజినీకాంత్ నటించిన కబాలి మూవీకి విడుదల డేట్ ని అనౌన్స్ చేస్తే.

దానికి అనుగుణంగా కొంత గ్యాప్ ఇచ్చి థియేటర్లలోకి రావాలన్నది వెంకీ-మారుతిల ఆలోచన.అందుకే జూలై 15న కబాలి వస్తుందనే ఉద్దేశ్యంతో జూలై 29న విడుదల చేయాలని భావించారు.

Advertisement

ఒక పక్క కబాలి సంగతి తేలడం లేదు మరొక పక్క ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే అయిపోవడం తో వెంకటేష్ మీదా మారుతి మీదా బాగా ఒత్తిడిగా ఉంది.డిస్ట్రిబ్యూటర్ ల తరఫునుంచి బాగా ఇబ్బందిగా ఉండడం తో ఎటూ తేల్చుకోలేక పోతున్నారు.

దిల్ రాజుకు కలిసొచ్చిన లక్ష్మణ్ తప్పు..
Advertisement

తాజా వార్తలు