“బాబు” కోసం వెంకయ్య “ఆఖరి పోరాటం”

భారత దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా తెలుగు రాష్ట్రాలని న్యాయం చేసేవారు.

ఏపీ కి అటు తెలంగాణకి ఎటువంటి సాయం అవసరం అయినా సరే తెలుగు వ్యక్తిగా అన్ని పనులు చేసి పెట్టేవారు.

ఏపీ పై చంద్రబాబు పై మాత్రం ఎనలేని ప్రేమాభిమానాలు చూపించే వారు వెంకయ్య అయితే ఈ పరిస్థితుల్లోనే కేంద్రం వెంకయ్య ముందరి కాళ్ళకి ఉపరాష్ట్రపతి అనే భందం వేసింది.అయినా సరే వెంకయ్య ఏపీ కి న్యాయం జరిగేలా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఏపీలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ అనిశ్చితికి కారణాలని చక్కదిద్దే ప్రయత్నంలో వెంకయ్య ఉన్నారు.బడ్జెట్ సమావేశాలలో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగింది అని టిడిపి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసి కేంద్రంతో కటీఫ్ అనుకున్న సమయంలో వెంకయ్య అడ్డుపడ్డారు నేను ఉన్నాను మాట్లాడుతూ అంటూ కేంద్రం పెద్దలతో మాట్లాడారు.

అయితే కేంద్రం వెంకయ్య మాటలు పట్టించుకోలేదు.అయితే ఒకానొక దశలో నా వాళ్ళ కాదు అంటూ వెంకయ్య చేతులు ఎత్తేశారు అనే మాటలు వినిపించాయి అయితే ప్రస్తుత పరిస్థితులు మరింతగా దిగాజారిపోతున్నాయి దాంతో స్పందించిన వెంకయ్య ఆఖరి ప్రయత్నంగా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారట.

Advertisement

అందులో భాగంగానే ఏపీలో పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాను ఆయ‌న ఒప్పించే దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం.

అన్ని శాఖల మంత్రుల‌ను పిలిపించి ఏపీకి పెండింగ్‌లో ఉన్న అంశాల‌ను ఒక్కొక్క‌టి క్లియ‌ర్ చేయాల‌ని లేకుంటే తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని ఆయ‌న వివరించిన‌ట్లు స‌మాచారం.ఎన్నో ఏళ్లుగా బీజేపీకి చంద్ర‌బాబు న‌మ్మ‌క‌మైన మిత్ర‌ప‌క్షంలా ఉన్నాడ‌ని, టీడీపీని దూరం చేసుకుంటే ప‌రిస్థితులు భిన్నంగా ఉంటాయ‌ని ఆయ‌న అమిత్‌షాకి తెలియచేసినట్లుగా తెలుస్తోంది.

అయితే వచ్చే పార్లమెంటు సమావేశాలలో కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.అంతేకాదు.

ఏపీ బిజెపి నేతలతో కూడా చంద్రబాబు ని కానీ టిడిపిని కానీ విమర్శలు చేయకండి అంటూ ఆదేశాలు జారీ చేశారని అంటున్నారు.ఇదే కనుకా జరిగితే వెంకయ్య దౌత్యం ఫలించినట్టే అంటున్నారు విశ్లేషకులు.

గేమ్ ఛేంజర్ లో ఆ ఒక్క పాట చూస్తే చాలు టికెట్ డబ్బులు వెనక్కి వచ్చినట్టే : ఎస్ జె సూర్య
Advertisement

తాజా వార్తలు