టీఆర్ఎస్ కి షాక్ : ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం రద్దు !

ఇప్పటికే అనేక ఇబ్బందులకు గురవుతూ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ రెండు రకాల పౌరసత్వం కలిగి ఉండడంతో ఆయనపై విచారణ మొదలైంది.

చెన్నమనేని రమేష్ పై కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆది శ్రీనివాస్ గతంలో దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు గతంలోనే రమేష్ పౌరసత్వం చెల్లదని తీర్పు చెప్పింది.దానిపై చెన్నమనేని రమేష్ పిటిషన్ రివ్యూ పిటిషన్ వేయగా ఈ కేసును కేంద్ర హోంశాఖ పరిశీలించింది.

ఈ మేరకు చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది.జర్మనీలో సెటిలైన చెన్నమనేని రమేష్ 2009 ఎన్నికల్లో పోటీ చేసేందుకు తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందాడని, ఆయన పై ఉన్న ప్రధాన ఆరోపణ.1955 భారతీయ పౌరసత్వ చట్టం ప్రకారం చూసుకుంటే విదేశాల్లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న భారతీయులు మళ్లీ మన దేశ పౌరసత్వం పొందాలంటే కనీసం ఇక్కడ ఒక సంవత్సరం పాటు నివాసం ఉండాలి.దానికి సంబంధించిన తగిన ఆధారాలు కూడా సమర్పించాలి.

అయితే చిన్నమనేని రమేష్ 2009 ఎన్నికల ముందు కేవలం 96 రోజులు మాత్రమే మనదేశంలో నివాసం ఉన్నారు.కానీ ఇక్కడ ఏడాది పాటు నివాసం ఉన్నట్టుగా తప్పుడు పత్రాలు సమర్పించారు.

Advertisement

ఆ పత్రాలతోనే రమేష్ భారత పౌరసత్వాన్ని పొందారు.దీనిపై వేములవాడ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన ఆది శ్రీనివాస్ దీనిపై అప్పట్లోనే సవాలు చేశారు.

ఉమ్మడి ఏపీలోని హైకోర్ట్ ఈ కేసును విచారించి రమేష్ పౌరసత్వం చెల్లదని తీర్పు కూడా చెప్పింది.హైకోర్టు తీర్పుపై రమేష్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

అక్కడ కూడా ఆయనకు వ్యతిరేక తీర్పు వచ్చింది.తాజాగా రమేష్ భారత పౌరసత్వం రద్దు కావడంతో ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి అనర్హుడు అవుతాడు.

అయితే వేములవాడలో మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహిస్తారా లేక ఈ ఎన్నికల్లో రమేష్ పై పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తారా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది.

లండన్ చేరుకున్న ఏపీ సీఎం జగన్..!!
Advertisement

తాజా వార్తలు