వావ్.. భార్యపై వరుణ్ సందేశ్ కు ఎంత ప్రేమ!

బుల్లితెర రియాలిటీ షోలలో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన వితీకా ఈ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.

అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు వితికా "పడ్డానండి ప్రేమలో మరీ", ప్రేమించే రోజులలో వంటి చిత్రాలలో సందడి చేశారు.

అయితే వితికా తెలుగు హీరో యువ నటుడు అయిన వరుణ్ సందేశ్ ను పెళ్లి చేసుకున్నారు.వీరిద్దరూ కలిసి నటించిన సినిమా "పడ్డానండి ప్రేమలో మరీ".

ఈ సినిమా ద్వారా నిజంగానే ప్రేమలో పడిన ఈ జంట మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.ఫిబ్రవరి 3 వితికా పుట్టినరోజు కావడంతో ఆమె భర్త తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ హార్ట్ టచింగ్ పోస్టు పెట్టాడు.

ఈరోజు"నా దేవత పుట్టినరోజు, ఆ దేవుడు నీకు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, నీకు అంత మంచే జరగాలని కోరుకుంటున్నాను"అంటూ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

Advertisement

బిగ్ బాస్ సీజన్లలో సీజన్ త్రీ కి ఎంతో ప్రత్యేకత ఉంది.ఏ సీజన్లో లేనివిధంగా సీజన్ త్రీ లో మొట్టమొదటి సారిగా హౌస్ లోకి భార్యాభర్తలను కంటెస్టెంట్ లుగా వెళ్లిన సెలబ్రిటీ జంట వితికా_వరుణ్ జంట అని చెప్పవచ్చు.కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి నెగిటివిటీతో బయటకు వచ్చిన తర్వాత తన పై ఏర్పడిన నెగిటివిటీ పోగొట్టుకోవడం కోసం వితికా సొంతంగా యూ ట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో తనపై ఏర్పడిన నెగిటివిటీ గురించి క్లారిటీ ఇస్తూ పలు వీడియోలు చేసి తనపై ఏర్పడిన నెగిటివిటీని చెరిపేసుకుంది వితికా.

 నేడు ఈమె పుట్టినరోజు సందర్భంగా ఆమె అభిమానులు పెద్ద ఎత్తున తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు