వంశీ ఇంకా ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవలే తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే.

వంశీని కాపాడుకునేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఏపీ మాజీ సీఎం తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు సార్లు వంశీతో మాట్లాడినట్లుగా కూడా సమాచారం అందుతోంది.ఏది ఏమైనా కూడా వంశీ పార్టీ మారే యోచనలోనే ఉన్నాడు.

ఈయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడం ఇక్కడ ఆసక్తికర విషయం.వైకాపాలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే అంటూ జగన్‌ గతంలో చెప్పిన కారణంగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడని అంటున్నారు.

తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసిన వంశీ ఎందుకు వైకాపాలో జాయిన్‌ అవ్వడం లేదు అనే విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.మళ్లీ వంశీ ఏమైనా మనసు మార్చుకునే అవకాశం ఉందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

తెలుగు దేశం పార్టీ నాయకులు మరో వైపు ఆయన్ను పార్టీలోనే కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా మాజీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ వంశీతో తాము చెప్పేది చెప్పాం.

ఆయన పార్టీలోకి రావాలని ఇప్పటికి కోరుకుంటున్నాం.ఆయన కేసులకు భయపడాల్సిన అవసరం లేదు.

పార్టీ ఆయనకు మద్దతుగా ఉంటుందని నాని అన్నాడు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు