వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమా ప్రకటన ఎప్పుడు?

మెగా ఫ్యామిలీ నుండి మెగా బ్రదర్స్‌ చిన్న మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా ఉప్పెన చిత్రంతో పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే.

ఉప్పెన సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

సినిమా ఓటీటీలో విడుదల అవ్వనుందా, థియేటర్లలో విడుదల కాబోతుందా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.ఆ విషయం పక్కన పెడితే వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమా గురించిన చర్చ అప్పుడే మొదలైంది.

ఉప్పెన సినిమా విడుదల అయ్యేది ఎప్పుడో తెలియదు.కాని రెండవ సినిమా విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని మెగా ఫ్యామిలీ భావిస్తుంది.

వైష్ణవ్‌ తేజ్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఒక మంచి కథను రెడీ చేయించినట్లుగా తెలుస్తోంది.ఆకథ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి వినబోతున్నాడు.

Advertisement

మొదటి సినిమాలో డీ గ్లామర్‌గా కనిపించిన వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమాలో మాత్రం స్టైలిష్‌ స్టార్‌గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

యంగ్‌ డైరెక్టర్‌ ఈ మెగా మూవీకి డైరెక్షన్‌ చేయబోతున్నాడు.వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమాలో స్టైలిష్‌ లుక్‌తో కనిపించడంతో పాటు అద్బుతమైన డాన్స్‌ ప్రతిభను కూడా కనబర్చబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమాను మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టులో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

వైష్ణవ్‌ తేజ్‌ రెండవ సినిమాను పవన్‌కు సన్నిహితుడు అయిన రామ్‌ తాళ్లూరి నిర్మించబోతున్నాడట.

షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!
Advertisement

తాజా వార్తలు