ఉత్తమ్‌ : ఆ రెండు ఘటనలతో మన పరువు పోయింది

తెలంగాణకు ఒకప్పుడు బ్రాండ్‌ ఇమేజ్‌ ఉండేది.హైదరాబాద్‌ను ప్రపంచ ప్రసిద్ది గాంచిన నగరంగా అంతా భావించే వారు.

కాని ఇప్పుడు పరిస్థితి మారిందని, రాష్ట్రం పరువు పోయింది అంటూ టీపీసీసీ చీప్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.నేడు పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మరియు టీఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.

ఈ సందర్బంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.టీఆర్‌ఎస్‌కు వరుసగా రెండు సార్లు అధికారం ఇచ్చినా కూడా ప్రజలకు జరిగిన మేలు శూన్యం.

మద్యం ఆదాయం రెట్టింపు చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి మద్యంను ఏరులై పారిస్తున్నారు.దిశ సంఘటన మరియు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలతో రాష్ట్రం పరువు జాతీయ మరియు అంతర్జాతీయ స్తాయిలో పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

అమ్మాయిలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఎద్దేవ చేశాడు.మరో వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని కూడా ఉత్తమ్‌ విమర్శించాడు.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు