ఉమ్మడి నల్లగొండ నుండి ఆ ఇద్దరే అమాత్యులు...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ఏనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలైన నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) (హుజూర్ నగర్ ఎమ్మెల్యే), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ ఎమ్మెల్యే)లకు క్యాబినెట్ బెర్త్ దక్కింది.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆ ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు.

దీనితో ఉమ్మడి జిల్లాలో నల్లగొండ,సూర్యాపేట జిల్లాలకు మంత్రి పదవులు దక్కినట్లు అయింది.ఇక మిగిలిన యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఏదైనా క్యాబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్ పదవి దక్కేనా ? అనే చర్చ జరుగుతుంది.ఉత్తమ్ కుమార్ రెడ్డి.సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో నలమాద పురుషోత్తంరెడ్డి, ఉషాదేవి దంపతులకు 1962 జూన్ 20 న జన్మించారు.1982-1991 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పైలట్ గా, రాష్ట్రపతి భవన్ ప్రతేక అధికారిగా ఉన్నత సేవలందించారు.పద్మావతి రెడ్డి ( Padmavathi Reddy )వివాహం చేసుకున్నారు.

ఉత్తమ్ దంపతులకు పిల్లలు లేరు.రాజకీయాలపై మక్కువతో1995 లో కాంగ్రెస్ పార్టీ నుండి కోదాడ బరిలో నిలిచి రాజకీయ ఆరంగ్రేటం చేసి,టిడిపి అభ్యర్ధి వేనేపల్లి చందర్ రావు చేతిలో ఓడిపోయారు.1999, 2004 లో రెండు సార్లు కోదాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు.నియోజకవర్గాల పునర్విభజనలో హుజూర్ నగర్ నుండి పోటీ చేసి 2009,2014,2018, 2023 లో నాలుగు సార్లు వరుస విజయాలను సాధించారు.2019 లో నల్లగొండ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు.ప్రస్తుతం ఎంపిగా ఉంటూనే మళ్ళీ హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తొలి ప్రయత్నంలో ఓటమి చెందినా ఆ తర్వాత 6సార్లు ఎమ్మేల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి ఓటమి ఎరగని నేతగా రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015 ఫిబ్రవరినుండి 2021 జూన్ వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు.ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి కూడా 2014 లో కోదాడ నుండి ఎమ్మేల్యేగా గెలుపొందారు.2018 లో స్వల్ప తేడాతో ఓటమి చెందినా తిరిగి 2023లో భారీ మెజారిటీతో విజయం సాధించారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) నల్లగొండ జిల్లా, నార్కెట్‌పల్లి మండలం, బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో కోమటిరెడ్డి పాపిరెడ్డి, సుశీలమ్మ దంపతులకు 1963 మే 23 న జన్మించారు.

బి.ఇ.పూర్తి చేసి 1986 పట్టా అందుకున్నారు.సబితను జీవిత భాగస్వామిగా చేసుకోగా వారికి ఒక కురుతు శ్రీనిధి ఉన్నారు.1999 లో నల్లగొండ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశంతోనే తొలిసారి గెలిచారు.2004,2009, 2014లలో నల్లగొండ నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించిన తొలి ఎమ్మెల్యేగా రికార్డ్ సొంతం చేసుకున్నారు.ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌భుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా,రోశయ్య మంత్రివర్గాలలో ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల మంత్రిగా,కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మౌలిక వసతులు, పెట్టుబడులు,రేవుల శాఖ మంత్రిగా పనిచేశారు.

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మంత్రిపదవికి రాజీనామా చేయగా గవర్నరు 2011 అక్టోబరు 5న ఆమోదించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ న‌ల్గొండప‌ట్ట‌ణంలో 2011న‌వంబ‌రు 1 నుంచి తొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేప‌ట్టారు.ఇది తెలంగాణ చ‌రిత్ర‌లోనే ప్ర‌త్యేక ఘ‌ట్టంగా నిలిచింది.2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.2019 భువనగిరి లోక్‌సభ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పై 4500 ఓట్ల మెజారిటీతో గెలిచారు.2022 ఏప్రిల్ 10న కాంగ్రెస్ అధిష్టానంఆయనను 2023 శాసన సభ ఎన్నికల టీ కాంగ్రెస్‌కు స్టార్‌ క్యాంపెనర్‌గా నియమించింది.2023 సెప్టెంబర్ 20న కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో స్థానం కల్పించింది.2023 లో నల్లగొండ నుండి గెలిచి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.

చైనాలో దారుణం : టాయిలెట్‌లో చిన్నారిని బంధించిన ఇద్దరు మహిళలు..
Advertisement

Latest Nalgonda News