ఉస్తాద్ కోసం భారీ సెట్ నిర్మాణం.. పవన్ టూర్ గ్యాప్ లో షెడ్యూల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’( Ustaad Bhagat Singh movie ).ఈ కాంబో ఇప్పటికే వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

 Ustaad Bhagat Singh Movie Release Shoot Update Details, Ustaad Bhagat Singh, Har-TeluguStop.com

అందుకే ఈ కాంబో అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ఈ కాంబో లోనే కావడంతో మరోసారి ఈ కాంబో ఎప్పుడు వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

Telugu Gabbar Singh, Harish Shankar, Pawan Kalyan, Ustaadbhagat-Movie

ఉస్తాద్ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.గబ్బర్ సింగ్ వచ్చిన పుష్కర కాలం తర్వాత ఈ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుండడంతో ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్టు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.అయితే ఇటీవలే ఈసినిమా షూట్ స్టార్ట్ అయ్యి కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ పై అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు.

అయితే పవన్ మళ్ళీ పొలిటికల్ టూర్ ప్లాన్ చేయగా ఈ లోపు ఓజి షూట్ స్టార్ట్ చేయనున్నారు.దీంతో ఉస్తాద్ సంగతి ఏంటి అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ గురించి అదిరిపోయే సమాచారం బయటకు వచ్చింది.ఈ సినిమా కోసం భారీ సెట్ నిర్మాణం చేస్తున్నారని పవన్ టూర్ గ్యాప్ రాగానే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది.

Telugu Gabbar Singh, Harish Shankar, Pawan Kalyan, Ustaadbhagat-Movie

ఇది జూన్ 26 నుండి రీస్టార్ట్ అవుతుంది అని అంటున్నారు.మొత్తానికి పవన్ పొలిటికల్ గా బిజీ అయిన ఆ గ్యాప్ లో కూడా సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా శ్రీలీలకు హీరోయిన్ గా నటిస్తుండగా.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube