ఉస్తాద్ కోసం భారీ సెట్ నిర్మాణం.. పవన్ టూర్ గ్యాప్ లో షెడ్యూల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'( Ustaad Bhagat Singh Movie ).

ఈ కాంబో ఇప్పటికే వచ్చి సూపర్ హిట్ అయ్యింది.అందుకే ఈ కాంబో అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ఈ కాంబో లోనే కావడంతో మరోసారి ఈ కాంబో ఎప్పుడు వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

"""/" / ఉస్తాద్ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.గబ్బర్ సింగ్ వచ్చిన పుష్కర కాలం తర్వాత ఈ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతుండడంతో ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్టు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే ఇటీవలే ఈసినిమా షూట్ స్టార్ట్ అయ్యి కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ పై అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నాడు.

అయితే పవన్ మళ్ళీ పొలిటికల్ టూర్ ప్లాన్ చేయగా ఈ లోపు ఓజి షూట్ స్టార్ట్ చేయనున్నారు.

దీంతో ఉస్తాద్ సంగతి ఏంటి అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ గురించి అదిరిపోయే సమాచారం బయటకు వచ్చింది.

ఈ సినిమా కోసం భారీ సెట్ నిర్మాణం చేస్తున్నారని పవన్ టూర్ గ్యాప్ రాగానే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది.

"""/" / ఇది జూన్ 26 నుండి రీస్టార్ట్ అవుతుంది అని అంటున్నారు.

మొత్తానికి పవన్ పొలిటికల్ గా బిజీ అయిన ఆ గ్యాప్ లో కూడా సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా శ్రీలీలకు హీరోయిన్ గా నటిస్తుండగా.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

పవన్ వల్ల ఆ స్థలాలకు రెక్కలొచ్చాయట.. ఆ స్థలాల విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!