'లియో' హైప్ కోసం చరణ్ ను వాడుకుంటున్నారా.. ఫ్రీ పబ్లిసిటీ అంటే ఇదేనేమో!

దసరా బరిలో మూడు భారీ సినిమాలు ఉన్నాయి.మరి వాటిలో కోలీవుడ్ నుండి రాబోతున్న లియో సినిమా ఒకటి.

దళపతి విజయ్( Thalapathy Vijay ) జోసెఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ లియో.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఎందుకంటే అటు విజయ్ క్రేజ్ ఇటు లోకేష్ క్రేజ్ కలిసి ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఇక తమిళ్ లో ఓకే కానీ తెలుగులో ఉన్న కొద్దీ బజ్ ను మరింత పెంచేందుకు లియో టీమ్ కు చరణ్ హెల్ప్ అవుతున్నాడు.

ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.లియో సినిమా( Leo )లో రామ్ చరణ్ తేజ్కూడా ఉన్నాడు అనే వార్త గత రెండు రోజులుగా టాలీవుడ్ లో మార్మోగి పోతుంది.

Advertisement

చరణ్ ఉన్నాడా లేడా అనే విషయం పక్కన పెడితే ఈ టాక్ నే అందరిలో క్రేజీగా మారిపోయింది.

ఇక చరణ్ పేరును ఓవర్సీస్ బుకింగ్స్ సైట్స్ లో పొందుపరచడంతో నిజంగానే గ్లోబల్ స్టార్ ఉన్నడేమో అని అక్కడ బుకింగ్స్ మరింత పెరిగాయి.అక్కడ బుకింగ్స్ సైట్స్ లోనే పేరు చేర్చడంతో నిజంగానే చరణ్ ఉన్నాడనే ప్రచారం జరిగింది.దీంతో మూవీ లవర్స్ లో ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది.

ఆల్రెడీ ఈ సినిమాపై క్రేజ్ ఉంది.కానీ చరణ్( Ram Charan పేరు కూడా యాడ్ అవ్వడంతో ఈ హైప్ పీక్స్ కు చేరుకుంది.

దీంతో ఈ ఫ్రీ పబ్లిసిటీని ఇలా వాడుకుంటున్నారు.ఏది ఏమైనా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఈ సినిమా కోసం కూడా పని చేసింది అనే చెప్పాలి.కాగా లియో సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తుంది.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు