వేసవిలో చర్మ సమస్యలకు పుచ్చకాయ ఫేస్ ప్యాక్స్

వేసవి కాలంలో వేసవి తాపాన్ని తగ్గించుకోవటానికి పుచ్చకాయను తింటూ ఉంటాం.

పుచ్చకాయలో 93 శాతం నీరు ఉండుట వలన చర్మానికి తేమను అందించటమే కాకుండా తాజాగా ఉండేలా చేస్తుంది.

పుచ్చకాయలో ఖనిజాలు మరియు విటమిన్లయిన ఏ, ఇ, సి మరియు బి6 ఉండుట వలన ఎన్నో చర్మ సమస్యలకు పరిష్కారం చూపుతుంది.ఇప్పుడు చర్మ సమస్యల పరిష్కారానికి పుచ్చకాయను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

ఒక స్పూన్ పుచ్చకాయ రసంలో ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మంపై మృత కణాలను తొలగించటానికి సహాయపడుతుంది.

ఒక స్పూన్ పుచ్చకాయ రసంలో ఒక స్పూన్ తేనే కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ చర్మంపై ఉన్న ట్యాన్ ని తొలగించటానికి సహాయపడుతుంది.

Advertisement

పుచ్చకాయ రసంలో కీరా రసాన్ని కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ ప్యాక్ ఫైగ్మెంటేషన్ ని సమర్ధవంతంగా ఎదురుకొంటుంది.పుచ్చకాయ ముక్కలు,అరటి పండు ముక్కలను మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

అరటిపండులో ఉండే బి విటమిన్ కాంప్లెక్స్ మొటిమల వలన కలిగే నొప్పిని తగ్గిస్తుంది.

Advertisement

తాజా వార్తలు