జుట్టు రాలకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లైనా ఈ ఆయిల్ వాడండి!

జుట్టు రాలకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.హెయిర్ ఫాల్ ను తగ్గించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

ఏవేవో హెయిర్ ప్యాక్స్( Hair packs ) వేసుకుంటూ ఉంటారు.కురుల సంరక్షణకు ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు.

అయినా సరే కొందరిలో మాత్రం జుట్టు హెవీగా రాలుతూనే ఉంటుంది.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే జుట్టు రాలమన్నా రాలదు‌.మరి ఇంకెందుకు ఆలస్యం హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండిముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో క‌ప్పు వేపాకులు, రెండు స్పూన్లు అల్లం ముక్కలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement
Use This Oil Twice A Week To Prevent Hair Fall! Hair Fall, Stop Hair Fall, Hair

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి.అలాగే వేపాకు అల్లం మిశ్రమం కూడా వేసి చిన్న మంటపై ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారపెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక అప్పుడు స్ట్రైనర్‌ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Use This Oil Twice A Week To Prevent Hair Fall Hair Fall, Stop Hair Fall, Hair

ఈ ఆయిల్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.ఇక ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకొని కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ రాసుకున్న నాలుగు గంటల తర్వాత లేదా మరుసటి రోజు తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే జుట్టు రాలడం చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.

Use This Oil Twice A Week To Prevent Hair Fall Hair Fall, Stop Hair Fall, Hair
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

వేపాకు, అల్లం( Neem , Ginger )లో ఉండే పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మారుస్తాయి.హెయిర్ ఫాల్( Hair Loss ) కు అడ్డుకట్ట వేసాయి.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేసి జుట్టు ఒత్తుగా ఎదిగేలా ప్రోత్సహిస్తాయి.

Advertisement

వేపాకులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి.ఇవి చుండ్రు, దుర‌ద‌ను తొలగించడంలో సహాయపడతాయి.మీ స్కాల్ప్‌ను తేమగా మరియు ఆరోగ్యంగా సైతం ఉంచుతాయి.

తాజా వార్తలు