అమెరికా ప్రొఫెసర్ కి వార్నింగ్ ఇచ్చిన ఇండియన్స్...!!!

నోరు దగ్గర పెట్టుకుంటే సమాజం దగ్గరవుతుందని అంటారు పెద్దలు.కానీ అమెరికాలో ఓ చదువులు చెప్పే ప్రొఫెసర్ మాత్రం తన నోరు అదుపులో పెట్టుకోలేక పోయాడు.

మరి తాను చదివిన చదువు విజ్ఞత నేర్పలేక పోయిందో ఏమో కానీ మొత్తానికి భారతీయుల నోటికి బలై పోయాడు.అంతేకాదు తన సొంత అమెరికన్స్ కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.

ఇంతకీ అతడు చేసిన ఘనకార్యం ఏమిటంటే.ఎంతో మంది విదేశీయులు భారత దేశం వచ్చి ఇక్కడి వంటకాల గురించి తెలుసుకుని లొట్టలేసుకుంటూ తింటూ నేర్చుకుని మరీ వెళ్తుంటారు.

అంతేకాదు విదేశాలలో భారతీయ రెస్టారెంట్లు వద్ద భారతీయులకంటే కూడా విదేశీయులే అత్యధికంగా ఉంటారు.మన వంటకాలంటే దేశ విదేశాలలో అంత ఫేమస్ మరి.అలాంటిది అమెరికాకి చెందిన ఒక ప్రొఫెసర్ భారతీయ వంటకాలు చాలా దారుణంగా ఉంటాయ్, నూనెలు ఎక్కువగా వాడుతారు, ఛి ఛి అంటూ కామెంట్స్ చేశాడు.

Advertisement

ఈ కామెంట్స్ చేసిన ప్రొఫెసర్ టామ్ నికోలస్ దుమ్ము దులిపేశారు భారతీయ నెటిజన్లు.నువ్వు మనిషివా దున్నపోతువా అంటూ మొదలెట్టి భారత దేశంలో ఎన్ని తిట్లు ఉంటాయో అన్ని తిట్లు తిట్టి తలంటేశారు.నూనె ఎక్కువగా వాడుతాం, కారం ఎక్కువగా తింటాం అది నీకెందుకురా అంటూ మంది పడ్డారు.

వారికి తోడుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది భారతీయ వంటకాల అభిమానులు రెచ్చి పోయారు.నోరు అదుపులో పెట్టుకో అంటూ కొంతమంది విదేశీయులు సైతం కామెంట్స్ చేయడం టామ్ కి షాక్ ఇచ్చి ఉంటుంది అంటున్నారు నెటిజన్లు.

Advertisement

తాజా వార్తలు