అమెరికా : త్వరలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌.. భారత సంతతి లాయర్‌కు లక్కీ ఛాన్స్

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

డెమొక్రాట్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్,( Joe Biden ) రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) త్వరలో అధికారికంగా నామినేషన్ పొందనున్నారు.

ఇప్పటికే వీరిద్దరి మధ్య అట్లాంటాలో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ వాడి వేడిగా జరిగింది.ఇందులో బైడెన్‌తో పోలిస్తే ట్రంప్ పైచేయి సాధించారు.

ఇదిలావుండగా.ఈ నెలాఖరులో విస్కాన్సిన్‌లో జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు( Republican National Convention ) భారతీయ అమెరికన్ కమ్యూనిటీ నాయకుడు, న్యాయవాది హర్దామ్ త్రిపాఠీకి( Hardam Tripathi ) అరుదైన అవకాశం దక్కింది.

ఈ సభకు ప్రత్యామ్నాయ అధికార ప్రతినిధిగా ఆయన ఎన్నికయ్యారు.కన్వెన్షన్‌లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష అభ్యర్ధిగా నామినేట్ చేయనున్నారు.

Advertisement
US Indian-origin Attorney Hardam Tripathi Elected Alternate Delegate To RNC Deta

జూలై 14 నుంచి 18 వరకు మిల్వాకీలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ (ఆర్ఎన్‌సీ) జరగనుంది.

Us Indian-origin Attorney Hardam Tripathi Elected Alternate Delegate To Rnc Deta

రిపబ్లికన్ పార్టీలో శాశ్వత సభ్యుడైన త్రిపాఠీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.ఆర్‌ఎన్‌సీలో తాను జాతీయ ప్రతినిధిగా పనిచేయడం ఇదే తొలిసారని చెప్పారు.త్వరలో అమెరికాలో జరగనున్న చారిత్రాత్మక ఎన్నికల్లో ఫ్లోరిడా 15వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌కు ప్రాతినిథ్యం వహించడం తనకు దక్కిన గౌరవంగా త్రిపాఠీ అభివర్ణించారు.

ఆయన వృత్తిరీత్యా ఇమ్మిగ్రేషన్ అటార్నీగా సేవలందిస్తున్నారు.ఫ్లోరిడా( Florida ) కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయ సంస్థ ‘‘ ట్రిప్ లా ’’కు( Trip Law ) మేనేజింగ్ అటార్నీగా పనిచేస్తున్నారు.

Us Indian-origin Attorney Hardam Tripathi Elected Alternate Delegate To Rnc Deta

బైడెన్ హయాంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ సమయంలో తాలిబాన్ల నుంచి తప్పించుకున్న అఫ్ఘన్ అనుకూలవాదులకు ప్రత్యేక ఇమ్మిగ్రెంట్ వీసాలను ఇప్పించడంలో హర్దామ్ కీలకపాత్ర పోషించారు.అమెరికా సాయుధ దళాలతో కలిసి పనిచేసిన వలసదారుల భద్రతను పరిరక్షించడం, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ఇమ్మిగ్రేషన్ లా అండ్ పాలసీని ఉపయోగించడం మా సంస్థ ముఖ్యోద్దేశమని ఆయన తెలిపారు.కాగా.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

ఈ వారం ప్రారంభంలో ప్రముఖ భారతీయ వైద్యుడు డాక్టర్ సంపత్ శివంగి.రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు ఆరవసారి అధికారిక ప్రతినిధిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు