మీ సేవలు మరువలేనివి : ఇండో అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్ జైన్‌పై జిల్ బైడెన్ ప్రశంసలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దశాబ్ధాల క్రితమే అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.

అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.

ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్‌, నార్త్ కరోలినా తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.

అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెగ తపిస్తుంటారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు- 2020లో భారతీయుల హవా స్పష్టంగా కనిపించింది.

భారతీయులలో రిపబ్లికన్ పార్టీకి మద్ధతుగా నిలిచేవారు కొందరైతే.డెమొక్రాట్లకు అండగా వుండేవారు ఇంకొందరు.

Advertisement

ఈ రెండు పార్టీలు ఇండో అమెరికన్లకు సమానంగానే ప్రాధాన్యత కల్పిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సిలికాన్ వ్యాలీకి చెందిన భారత సంతతి పారిశ్రామికవేత్త అజయ్ జైన్ భుటోరియాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, దేశ ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బైడెన్ ప్రశంసల వర్షం కురిపించారు.

గతవారం సిలికాన్ వ్యాలీలోని డెమొక్రాటిక్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న జిల్ బైడెన్ మాట్లాడుతూ.అధ్యక్ష ఎన్నికల్లో అజయ్ సహకారాన్ని ప్రస్తావించారు.

ఈ సందర్భంగా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో తాను భుటోరియా ఇంటికి వెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ క్రమంలో భుటోరియా మాట్లాడుతూ.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో జెలెన్ స్కీకి మద్ధతుగా నాటో మిత్రదేశాలను నడిపించడంపై జో బైడెన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌పై అజయ్ జైన్ భుటోరియా ప్రశంసల వర్షం కురిపించారు.బైడెన్ ప్రపంచాన్ని ఏకం చేశారని ఆయన అన్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఈ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ నుంచి రష్యా బహిష్కరించబడిందని.వీసా, మాస్టర్‌కార్డ్‌ సహా ప్రధాన క్రెడిట్ కార్డ్‌లు, లావాదేవీలు నిలిపివేయబడ్డాయని అజయ్ పేర్కొన్నారు.

Advertisement

స్వాతంత్య్రం కోసం పోరాడటం అంటే ఏమిటో ఉక్రెయిన్ ప్రజలు ప్రపంచానికి చూపిస్తున్నారని భుటోరియా ప్రశంసించారు.వారి ధైర్య సాహసాలు, వీరత్వం స్పూర్తిదాయకమని.

మాస్కో తన అనాలోచిత చర్యలకు మూల్యం చెల్లించాల్సి వుంటుందన్నారు.ఉక్రెయిన్‌పై యుద్ధానికి కారణమైన పుతిన్, అతని బృందానికి శిక్ష తప్పదని అజయ్ జైన్ హెచ్చరించారు.

ఇకపోతే గతేడాది నలుగురు భారత సంతతి ప్రముఖులకు కీలక పదవులు కట్టబెట్టారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.వీరిలో అజయ్‌ జైన్‌ భుటోరియా, సోనాల్‌ షా, కమల్‌ కాల్సీ, స్మితా ఎన్‌ షాలు ఉన్నారు.

ఆసియన్‌ అమెరికన్లు, నేటివ్‌ హవాయియన్లు, పసిఫిక్‌ ద్వీపవాసులకు (ఏఏఎన్‌హెచ్‌పీఐ) సంబంధించిన అడ్వైజరీ కమిషన్‌లో వీరికి చోటు కల్పించారు.ఈ నలుగురు ప్రముఖులు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు.

సిలికాన్‌ వ్యాలీలో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా అజయ్‌ భుటోరియా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.

" autoplay>

తాజా వార్తలు