అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా భారతీయులు.. యూఎస్ రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు

అగ్రశ్రేణి అమెరికా కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న భారతీయులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.

సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్‌తో( Satyanadella , Sundar Pichai ) మొదలుపెడితే ఈ లిస్ట్ చాలా పెద్దది.

ఈ నేపథ్యంలో భారత సంతతి సీఈవోలపై ఇండియాలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి( US Ambassador Eric Garcetti ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జాతీయ మీడియా సంస్థ ఏఎన్ఐ నిర్వహించిన ఇంటరాక్షన్ సెషన్‌లో పాల్గొన్న గార్సెట్టి మాట్లాడుతూ.

ఒకప్పుడు భారతీయులైతే యూఎస్‌లో సీఈవో కాలేరని జోక్ ఉండేదని, కానీ అది ఇప్పుడు రివర్స్ అయ్యిందన్నారు.మీరు భారతీయులైతేనే అమెరికాలో సీఈవోలు కాగలరని గార్సెట్టి వ్యాఖ్యానించారు.

ఫార్చ్యూన్ 500 కంపెనీలకు చెందిన సీఈవోలలో( CEOs ) ఎక్కువ మంది అమెరికాలో చదువుకున్న భారతీయ వలసదారులేనని ఆయన పేర్కొన్నారు.ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్న సుందర్ పిచాయ్ 2019 నుంచి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు నాయకత్వం వహిస్తున్నారని, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల హైదరాబాద్‌లోనే జన్మించారని గార్సెట్టి గుర్తుచేశారు.

Advertisement

శంతను నారాయణ్ (అడోబ్), అరవింద్ కృష్ణ (ఐబీఎం), లక్ష్మణ్ నరసింహన్ (స్టార్ బక్స్), సంజయ్ మెహ్రోత్రా( Sanjay Mehrotra ) (మైక్రాన్)లకు నాయకత్వం వహిస్తున్న భారతీయులని ఆయన వెల్లడించారు.

కాగా.కొద్దిరోజుల క్రితం పీటీఐతో గార్సెట్టి మాట్లాడుతూ.భారతీయుల వీసా నిరీక్షణ సమయాన్ని తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తనకు చెప్పారని ఆయన వెల్లడించారు.

ఈ ఏడాది భారతీయ విద్యార్ధుల నుంచి మరిన్ని దరఖాస్తులు స్వీకరించడానికి యూఎస్ మిషన్ సిద్ధమవుతోందని గార్సెట్టి తెలిపారు.అమెరికా చరిత్రలో ఒక అధ్యక్షుడు రాయబారితో ఇలా చెప్పడం ఇదే తొలిసారని ఆయన అభిప్రాయపడ్డారు.

మన భారతీయ స్నేహితులు.వారి కుటుంబ సభ్యులను, సహోద్యోగులను, వ్యాపార భాగస్వాములను చూడాలని కోరుకుంటారని బైడెన్ తనతో అన్నారని ఎరిక్ గార్సెట్టి చెప్పారు.నిరీక్షణ సమయం తగ్గితే.

జెనీలియా నటించిన ఈ నాలుగు సినిమాల్లో ఓ కామన్ పాయింట్ గుర్తించారా..??
మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌పై భారీ రివార్డ్ ప్రకటించిన ఎన్ఐఏ

ఎక్కువ మంది భారతీయులు అమెరికా రావాలనే కోరిక నెరవేరుతుందన్నారు.భారత్ - అమెరికా సంబంధాలలో విద్యది కీలకపాత్రగా ఎరిక్ గార్సెట్టి అభిప్రాయపడ్డారు.

Advertisement

ఇరు దేశాలను, ఇరు ప్రజలను విద్యార్ధుల మార్పిడి కంటే ఎక్కువగా ఏదీ కలపలేదని తాను భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు