బాలయ్య దబిడి దిబిడి సాంగ్ కోసం ఊర్వశి షాకింగ్ రెమ్యూనరేషన్.. ఎంతంటే?

సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని చెప్పాలి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తాయి.

ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు సినిమాలు వరుసగా విడుదల కానున్న నేపథ్యంలో థియేటర్ల వద్ద అసలైన సంక్రాంతి పండుగ కనపడునుంది.

ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) నటించిన డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమా విడుదల కాబోతోంది.

డైరెక్టర్ బాబీ( Bobby ) దర్శకత్వంలో నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా 12వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో ఊర్వశీ రౌతెల( Urvashi Rautela ) స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు.తాజాగా ఈ పాటను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ పాట భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నది.ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పై విమర్శలు వస్తున్నాయి.

Advertisement

ఇలా స్పెషల్ సాంగులో నటి ఊర్వశి సందడి చేయడంతో ఈ పాట కోసం ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం ఓ వార్త సంచలనంగా మారింది.దబిడి దిబిడి అంటూ( Dabidi Dibidi Song ) సాగిపోయే ఈ పాటలో ఆమె నడుము, బ్యాక్ టచ్ చేస్తూ బాలయ్య వేసిన స్టెప్స్‌ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.అయినప్పటికీ ఈ సాంగ్‌కు మాస్ జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇక ఈ పాటలో ఈమె నటించడానికి అక్షరాల కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి.ఐదు నిమిషాలకే కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు.

మరి ఈమె రెమ్యూనరేషన్ కి  సంబంధించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.

రష్మిక అబార్షన్ చేయించుకుందా....బాంబ్ పేల్చిన నటుడు...ఆయనే కారణమా?
Advertisement

తాజా వార్తలు