దీంతో ఉప్పెనలో విజయ్‌ పాత్రపై క్లారిటీ వచ్చినట్లేనా?

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ఉప్పెన.ఈ చిత్రంకు బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నాడు.

సుకుమార్‌ శిష్యుడు అయిన బుచ్చిబాబు ఈ సినిమాను గురువు గారి స్టైల్‌లో విభిన్నంగా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాడు.షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం వెయిట్‌ చేస్తుంది.

కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడినది.ఈనెల చివర్లో లేదా వచ్చే నెలలో ఈ చిత్రం వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి నటిస్తున్న విషయం తెల్సిందే.భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈ సినిమాలో ఆయన్ను నటింపజేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే విజయ్‌ నటిస్తున్న పాత్ర ఏంటీ.

Advertisement

అసలు ఆయన లుక్‌ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పకుండా ఇన్ని రోజులు దాచి ఉంచారు.ఎట్టకేలకు ఈ సినిమాలోని విజయ్‌ సేతుపతి లుక్‌పై క్లారిటీ ఇచ్చారు.

లుక్‌పై మాత్రమే కాకుండా సినిమాలో విజయ్‌ రోల్‌ ఏంటీ అనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు.విజయ్‌ విలన్‌గా కనిపించబోతున్నాడు అని ఈ పోస్టర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

చాలా సింపుల్‌గా రంగస్థలం చిత్రంలో జగపతిబాబు మాదిరిగా మాంచి విలనిజం చూపించేందుకు సిద్దంగా ఉన్నాడు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.లుంగీలో మనోడి లుక్‌ అదిరిందని నిజమైన విలన్‌లా గాంభీరంగా ఉన్నాడంటూ సోషల్‌ మీడియాలో ఈ పోస్టర్‌కు కామెంట్స్‌ వస్తున్నాయి.

కొత్త పార్టీ పెట్టేస్తున్న ప్రశాంత్ కిషోర్ .. పేరేంటంటే ?
Advertisement

తాజా వార్తలు