క్లిన్ కారాతో పవన్ కళ్యాణ్.. క్యూట్ ఫోటో షేర్ చేసిన ఉపాసన!

సినీ నటుడు పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రస్తుతం దేశ రాజకీయాలలో సంచలనంగా మారారు.

ఈయన జనసేన పార్టీ(Janasena party)తరఫున ఎన్నికలలో పోటీ చేసే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇక కూటమిలో భాగంగా ఈసారి జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలో కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ విధంగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో ఈయన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా అలాగే డిప్యూటీ సీఎం గా కూడా పనిచేయబోతున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మంత్రిగా జూన్ 12వ తేదీ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున మెగా కుటుంబ సభ్యులందరూ కూడా తరలివచ్చారు.పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో ఆయనకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

ఇక కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కొన్ని రేర్ ఫోటోలను కూడా మెగా ఫ్యామిలీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

Advertisement

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ఉపాసన దూరంగా ఉన్నప్పటికీ కూడా వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పవన్ చిరు ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.అదేవిధంగా వరుణ్ తేజ్ వివాహంలో పవన్ కళ్యాణ్ తన కుమార్తె క్లిన్ కార( Klin Kaara ) ను ఉపాసన ఎత్తుకొని ఉండగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) క్లిన్ కారాని ప్రేమగా ముద్దు చేస్తున్నట్టు ఉంది.పక్కనే రామ్ చరణ్ ( Ramcharan ) కూడా ఉన్నాడు.

ఈ రేర్ ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలపడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మరిన్ని ఇది చూసిన మెగా ఫ్యాన్స్ మరింత వైరల్ చేస్తున్నారు. .

Advertisement

తాజా వార్తలు