కుటుంబ పోషణ కోసం చివరికి సీరియల్స్ లో నటించిన సుత్తి వేలు

సుత్తివేలు.తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడు.

తన కామెడీ పాత్రలతో జనాలను నవ్వుల్లో ముంచిన నటుడు.

ఆయన సినిమాలో కనిపించాడు అంటేనే జనాలు విరగబడి నవ్వేవాళ్లు.

ఆయన అసలు పేరు సుత్తి వీరభద్రరావు.సినిమాల్లోకి వచ్చాక సుత్తివేలుగా మారిపోయాడు.

కామెడీ పాత్రలతో పాటు సీరియస్ పాత్రల్లో నటించి మెప్పించిన ఘనుడు ఆయన.వందల సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి.సుత్తివేలు గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే ప్ర‌తిఘ‌ట‌న‌ సినిమాలో పిచ్చివాడిగా మారిన పోలీస్ కానిస్టేబుల్‌గా నటించిన తీరును గుర్తు చేసుకుంటే సరిపోతుంది.

Advertisement

ఆ ఒక్కపాత్ర చాటు తను ఎంత గొప్ప నటుడో చెప్పుకోవడానికి.జంధ్యాలకు అత్యంత ప్రియ శిష్యుడు సుత్తివేల.ముద్దమందారంతో సినిమా నటుడిగా ఆయనను పరిచయం చేశాడు జంధ్యాల.

ఆ తర్వాత నాలుగు స్తంభాలాటతో మంచి పేరు వచ్చేలా చేశాడు.జంధ్యాల మరణం తర్వాత సుత్తివేలు చాలా బాధపడ్డాడు.

మద్రాసులో ఉన్నంత కాలం సుత్తివేలు నటనా జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.హైదరాబాద్ కు సినిమా పరిశ్రమ మారాక ఆయన పరిస్థితి మారింది.

నిజానికి హైదరాబాద్ కు వచ్చాక ఆయనకు కష్టాలు మొదలయ్యాయి.ఎంత కష్టపడ్డా సరైన గుర్తింపు రాలేదు.నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.

రజినీకాంత్ ను టార్గెట్ చేసిన స్టార్ డైరెక్టర్లు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021

ఒకప్పుడు సినిమాల్లో వెలుగు వెలిగిన సుత్తివేలుకు ఒకానొక సమయంలో కుటుంబం గడవడమే కష్టంగా మారింది.సినిమా అవకాశాలు రాక.చేతిలో డబ్బులు లేక అవస్థలు పడ్డాడు.భార్య, ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకును సాకడానికి టీవీ సీరియల్స్ లోనూ నటించాడు.

Advertisement

ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ సీరియల్ ఆనందో బ్రహ్మలో తెగ నవ్వించిన సుత్తివేలు.చిరి రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంత ప్రాధాన్యత లేని పాత్రల్లోనూ నటించాడు.చివరి రోజుల్లో అత్యంత దుర్భర జీవితం గడిపాడు.66 ఏండ్ల వయసులో ఆయన జీవితం నుంచి విశ్రాంతి తీసుకున్నాడు.2012 సెప్టెంబర్ లో సుత్తివేలు కన్నుమూశాడు.ఎంతో గొప్పగా బతికిన ఆయన చివరకు ఏ దిక్కూ లేకుండా అస్తమించాడు.

తాజా వార్తలు