ఇద్దరు లెజెండ్స్ స్థానంలో అనామక హీరోలను పెట్టిన కూడా జనాలను మెప్పించిన సినిమా !

కొన్ని సినిమాలు ఎప్పటికి ఒక క్లాసిక్ గా ఉండిపోతాయి.అలంటి వందల సినిమల్లో ఒకటి పదహారేళ్ళ వయసు.

ఈ సినిమాను భారతి రాజా తొలుత పదినారు వాయతినిలే అంటూ తమిళ్ లో తీసాడు.ఏది ఏమైనా పల్లెటూరునే నేపధ్యంగా తీసుకొని సినిమాలు తీయడం లో భారతి రాజా తరవాతే ఎవరైనా.

ఒక పల్లెటూరు లోనే పాత్రలను నడిపించడం, వాటి మధ్య సంఘర్షణ ను ప్రేక్షకుడిని కన్విన్స్ అయ్యేలా తీయడం ఆయనకు మాత్రమే చెల్లింది.చాల మందికి పదినారు వాయతినిలే సినిమానే నచుతుంది.

ఈ సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్ హీరోలు నటించాడు.ఒకరు రజినీకాంత్ మరొకరు కమల్ హాసన్.

Advertisement

ఈ ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ పడి నటించి సినిమాకు ప్రాణం పోశారు.పదినారు వాయతినిలే సినిమాను తెలుగు లో పదహారేళ్ళ వయసు పేరుతో తీసాక మన తెలుగు వారికి ఈ సినిమానే నచ్చుతుంది.

కొంత తమిళ సినిమాల్లో raw ఫీలింగ్ ఉన్నప్పటికి తెలుగు సినిమాల్లో అది తగిన మోతాదులోనే ఉంటుంది.లెజెండ్ యాక్టర్స్ ఎంత బాగా చేసి, సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిన తెలుగు వారికీ పదహారేళ్ళ వయసు సినిమానే బాగా నచ్చింది.

అక్కడ రజినీకాంత్ కంటే ఇక్కడ మోహన్ బాబు తెగ నాకేసాడు.అక్కడ కమల్ హాసన్ కంటే ఇక్కడ చంద్ర మోహన్ బాగా కనెక్ట్ అయ్యాడు.

అంత పెద్ద స్టార్స్ తో చేసిన సినిమాను తెలుగు కి వచ్చే సరికి పెద్దగా పేరు లేని మోహన్ బాబు, చంద్ర మోహన్ ని వాడుకోవడం నిజంగా దర్శకుడి సాహసం అనే చెప్పాలి.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..

ఇక రైల్వే స్టేషన్ లో శ్రీదేవి ఎదురు చుసిన వ్యక్తి రాకపోయే సరికి ఆమె కళ్ళల్లో ఆర్ద్రత మాటల్లో వర్ణించడం సాధ్యం అవుతుందా ? కళ్ళల్లోని మేఘాలు కన్నీటి వాన గా కురుస్తుంటే ఒక పాట రూపంలో అది బయట పెట్టిన తీరు అద్భుతం.ఇక చంద్ర మోహన్ ని అప్పటి దాకా లైట్ తీసుకున్న ప్రేక్షకుడు ఎప్పుడైతే శ్రీదేవి ని మోసం చేసిన వ్యక్త్తో ప్యాంటు మరియు షార్ట్ ని చెట్టుకు కట్టేసి కొడుతుంటే ఇప్పటి దాకా ఇంత మంచి నటుడిని చిన్న చూపు చూశామా అని ప్రేక్షకుడు ఫీల్ అయ్యేలా చేయడం నిజంగా హ్యాట్సాఫ్.గ్రామంలో ఎంత స్వచ్ఛంగా మనుషులు ఉంటారా అనిపించేంత అందంగా సినిమా ఉంటుంది.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా గురించి ఎన్నో వందల ఆర్టికల్స్ వచ్చి ఉంటాయి.కానీ ఏనాటికి మర్చిపోలేని ప్రతి ఒక్కరు మళ్లీ మళ్లీ చూడాల్సిన తెలుసుకోవాల్సిన సినిమా పదహారేళ్ళ వయసు.

తాజా వార్తలు