హాథ్ సే హాథ్ జోడో యాత్రకు అపూర్వ స్పందన:కొండేటి మల్లయ్య

నల్లగొండ జిల్లా:నకిరేకల్ నియోజకర్గస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రకు అపూర్వ స్పందన వస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కొండేటి మల్లయ్య అన్నారు.

కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో ఆదివారం ఉదయం ఆయన చేపట్టిన జోడో యాత్రలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,కాంగ్రెస్ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివవచ్చారు.

ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ,కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ మెంబర్ షిప్ కార్డులను పంపిణీ చేశారు.గ్రామంలో పలువురి కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందజేశారు.

Unprecedented Response To Hath Se Hath Jodo Yatra: Kondeti Mallaiah-హాథ్

అనంతరం ఆయన మాట్లాడుతూ జోడో యాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ ఇంకా ముందుకు నడిపిస్తుందనిఅన్నారు.నాయకులు, కార్యకర్తలు వందలాదిగా పాల్గొని పార్టీని తనను, ఆశీర్వదిస్తున్నారని తెలిపారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమాన్ని వదిలి,కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జఠంగి వెంకటనర్సయ్య, గుడివాడ మాజీ సర్పంచ్ షేక్.

Advertisement

లతీఫ్,నకిరేకల్ మండల మాజీ అధ్యక్షుడు రాచకొండ లింగయ్య, ఎంపీటీసీ గాజుల ప్రభాకర్, గుడివాడ గ్రామశాఖ అధ్యక్షుడు రాచకొండ లింగయ్య,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు గుండా జలంధర్ రెడ్డి, బడుగుల శేఖర్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవుల వేణు, దున్న కొండల్,ఏపూరి జగన్నాథ్,వార్డు మెంబర్, వేములకొండ సైదులు, వేములకొండ నర్సింహ, ఖమ్మంపాటి సతీష్, గద్దపాటి సతీష్,ఏ.నారాయణ,షేక్.

దస్తగిరి, చంద్రశేఖర్,గాజుల గోపి, రాచకొండ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Press Releases News