ధనవంతులకు ఆ బ్రిటీష్ యూనివర్సిటీ స్ట్రాంగ్ వార్నింగ్..?

ఇటీవల ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ( University of Edinburgh ) సంపన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఎందుకంటే ఈ యూనివర్సిటీలో చదువుకునే రిచ్ స్టూడెంట్స్‌( Rich Students ) తమని తాము మిగతా వారికంటే ఉన్నతంగా భావిస్తున్నారు.

తక్కువ ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల ఉచ్చారణలను అనుకరిస్తూ వారిని అవమానిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ యూనివర్సిటీ విద్యార్థులు సైతం ఇక్కడ చదువుకునేలాగా ఒక కార్యక్రమం ప్రారంభించింది ఆ కార్యక్రమం ద్వారా ఈ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులనే రిచ్ స్టూడెంట్స్ బాగా టార్గెట్ చేస్తున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా తక్కువ అర్హతలున్నప్పటికీ, పేద ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు విశ్వవిద్యాలయంలో చదువుకోవచ్చు.ఈ సమస్యను పరిష్కరించడానికి, సంపన్న విద్యార్థులకు మార్గదర్శక సూత్రాలను అందజేశారు.

అందరికీ సమాన అవకాశాలు లభించేలా చేయడం, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా విద్యార్థులను అవమానించడాన్ని నిరోధించడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం.యూనివర్సిటీ కూడా కులం ఆధారిత అవమానాలు( Class Discrimination ) క్యాంపస్‌లో ఉన్నాయని అంగీకరించింది.

Advertisement

అంతేకాకుండా, ఉచ్చారణల ఆధారంగా విద్యార్థులను అవమానించడాన్ని నిరోధించడానికి విశ్వవిద్యాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ సూచనల ప్రకారం, రిచ్ స్టూడెంట్స్ అహంకారాన్ని వదిలివేయాలి, తమని తాము ఇతరుల కంటే ఉన్నతంగా భావించుకోకూడదు.తన జీవితం ఇతరుల జీవితంలా ఉంటుందని అనుకోకూడదు.ప్రతి ఒక్కరి కుటుంబ నేపథ్యం, అనుభవాలు వేరు వేరుగా ఉంటాయి.

డబ్బున్న వారే తెలివైన వారు అనే భావనను వదిలివేయాలి.కష్టపడితేనే డబ్బు వస్తుందని అనుకోవడం సరికాదు.

ఇతరుల లక్ష్యాలు, అభిరుచుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.వారి ఆర్థిక స్థితిని బట్టి వారిని అంచనా వేయకూడదు.

కొబ్బరి నీళ్లల్లో ఇవి కలిపి రాసారంటే మీ ముఖం మరింత ప్రకాశంవంతంగా మెరిసిపోవడం ఖాయం..!
నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్

ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చినవారే.అంటే, తక్కువ ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ.అయితే, బ్రిటన్ మొత్తం మీద చూస్తే ఈ తక్కువ ఆర్థిక స్థోమత ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వారే ఎక్కువ.

Advertisement

దీని వల్ల పేద విద్యార్థులు( Poor Students ) విశ్వవిద్యాలయంలో సరిగా స్థిరపడలేకపోతున్నారు.ఆశ్చర్యకరంగా, ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుకునే 70% మంది విద్యార్థులు ఇంగ్లాండ్ నుంచి వచ్చినవారే.

అంతేకాకుండా, 40% మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదివారు.అయితే ఇప్పుడు యూనివర్సిటీ పేద విద్యార్థులను చులకనగా చూడకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి ఇకపై అక్కడ సమస్యలు ఉండకపోవచ్చు.

తాజా వార్తలు