టెన్నిస్ మ్యాచ్‌కు హాజరైన కుక్క.. తర్వాతేం చేసిందో చూడండి..

మనుషులు, జంతువుల మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంది.శతాబ్దాలుగా మనం వివిధ జంతువులను పెంచుకుంటూ వస్తున్నాం.

 Dog Reacts Like Human During Live Tennis Match Viral Video Details, Tennis Match-TeluguStop.com

ఈ క్రమంలో, కొన్ని జంతువులు మన మనుషులలాగే ప్రవర్తించడం మనం గమనించవచ్చు.దీనికి ఉదాహరణగా కుక్కలను( Dogs ) చెప్పవచ్చు.

మన ఇళ్ళలో కుక్కలున్నప్పుడు, అవి మన మాటలు అర్థం చేసుకుంటాయి.మనం చేసే చిన్న చిన్న సంకేతాలను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తాయి.

మనం ఆజ్ఞలు ఇస్తే వాటిని పాటిస్తాయి.ఇక కొన్ని కుక్కలు అయితే మనం చేసే పనులను కూడా అనుకరిస్తాయి.

ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్( Viral Video ) అయింది.ఆ వీడియోలో ఒక కుక్క ఒక టెన్నిస్ మ్యాచ్‌ని( Tennis Match ) అచ్చం మనుషుల లాగానే చాలా ఆసక్తిగా చూస్తుంది.

మనం మ్యాచ్ చూస్తున్నట్లే ఆ కుక్క కూడా చాలా సీరియస్‌గా మ్యాచ్‌ని చూస్తుంది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.ఒక కుక్క ఎంత వరకు మనలాగే ప్రవర్తించగలదో ఈ వీడియో చూసి తెలుసుకున్నారు.వైరల్ వీడియోలో, ఒక కుక్క ఒక టెన్నిస్ మ్యాచ్‌ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూడటం గమనించవచ్చు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో “వాట్ ఏ ఫ్యాన్, మాస్టర్ కాన్సంట్రేషన్ ఆన్ ది లిటిల్ బాల్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు.

ఈ వీడియో 17,000 లైక్స్‌ వచ్చాయి.చాలా మంది ఈ కుక్క ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు.ఒక యూజర్ ” ఈ కుక్క ఇంతకుముందు ఇలాంటి ఈవెంట్లో పాల్గొని ఉంటుందా? మ్యాచ్‌లను రోజూ చూసే కుక్కలాగానే ఇది చాలా ప్రశాంతంగా ఉందే” అంటూ ఈ కుక్క ఇలాంటి ఈవెంట్లలో పాల్గొనడానికి అలవాటుపడిందేమో అని అనుమానించారు.మరొకరు నవ్వుతూ, “ఆ బంతిని పట్టుకుంటే గేమ్ ఓవర్ అయిపోతుంది ఏమో అని కుక్క ఆలోచిస్తూ ఉండొచ్చు” అని కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube