KalvaKuntla kavitha KCR : కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి...కల్వకుంట్ల కవిత

కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

మునుగోడు లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ఆలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించారు.దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ కంటేశ్వర్ ఆలయంలో కార్తీక మాసంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.అనంతరం ఆలయ కమిటీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

అలాగే మునుగోడు లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం సాధించిందని ఎమ్మెల్సీ చెప్పారు.ప్రతిపక్ష పార్టీలు అవాకులు చివాకులు మాట్లాడకుండా ఉండాలని ఆమె హితవు పలికారు.

Advertisement

రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, నూడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు