Gaja Donga : ఐదు రోజుల్లో ఐదు పాటల చిత్రీకరణ పూర్తి చేసి రికార్డు సృష్టించిన ఆ సినిమా ఏంటో తెలుసా ?

టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరూ కూడా వారి వారి పేర్ల మీద అనేక రికార్డులను సృష్టించుకున్నారు.

కానీ ఎప్పటికీ చెరిగిపోని ఒక రికార్డ్ ఎన్టీఆర్( Senior NTR ) పేరు మీద నిలిచిపోయింది.

అదేంటంటే అతి తక్కువ టైంలో షూటింగ్ అనే విషయానికి వస్తే ఒక రికార్డు ఎన్టీఆర్ పేరు మీద నమోదయింది అదే ఐదు రోజుల్లో సినిమాకు సంబంధించిన ఐదు పాటల షూటింగ్ ను పూర్తి చేయడం.ఇలాంటి ఒక పని చేయాలంటే ఇప్పటి దర్శకులకు అయితే సాధ్యం కాదు.

మరి పాత రోజుల్లో కాదు కానీ నిన్న మొన్నటి పరిస్థితులలో కూడా నాలుగైదు రోజులు లేదా వారం రోజులు మరి ఎక్కువ పది రోజుల పాటు ఒక పాట కోసం కేటాయించేవారు.అయితే ఇలా ఐదు రోజుల్లో ఐదు పాటలను చిత్రీకరించిన సినిమా గజదొంగ( Gajadonga ). ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా కే నాగేశ్వరరావు, జి వెంకట రత్నం నిర్మాతలుగా వ్యవహరించారు.

రామారావు గారు ఏ సినిమాకైనా కేవలం నెలలో పది రోజులు షూటింగ్ ఇస్తారు.అలా మూడు నెలల్లో 30 రోజుల్లో పాటు ఒక చిత్రానికి టైం ఇస్తారు.ఎంత పెద్ద సినిమా అయినా ఆ లోపే పూర్తి చేసుకోవాలి.

Advertisement

కానీ గజదొంగ విషయానికి వచ్చేసరికి టాకీ పార్ట్ మాత్రమే పూర్తయింది ఐదు పాటల చిత్రీకరణ( Five Songs Shooting ) బ్యాలెన్స్ ఉండిపోయింది.అదే టైంలో సరిగ్గా ఎన్టీఆర్ కి చెయ్యి ఫ్రాక్చర్ అయింది.

ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు.కానీ సినిమా పరిస్థితి ఆరు వారాలు ఆగితే అప్పట్లో ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.

దాంతో నిర్మాతలు వెళ్లి హీరోని కలిసి అడగగా నాలుగు వారాలు మాత్రమే విశ్రాంతి తీసుకొని ఒక ఐదు రోజులు ఈ చిత్రం కోసం కేటాయించారు.

ఎన్టీఆర్ చేతికి నొప్పి ఉన్నా సరే షూటింగ్ పెట్టుకున్నారు.అయితే ఐదు రోజుల్లో ఐదు పాటలు పూర్తి చేయాలంటే రాఘవేంద్రరావు అన్ని రకాల పనులు పూర్తి చేసుకొని మంచి విజయంతో అలాగే టెక్నీషియన్ల సపోర్ట్ తో చేయాలి.అది కత్తి మీద సామ లాంటిది కానీ దానిని రాఘవేంద్రరావు గారు( Raghavendra Rao ) ఎంతో సులువుగా పూర్తిచేసి ఐదు రోజుల్లో ఐదు పాటల షూటింగ్ పూర్తి చేశారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

ఆ పాటలన్నీ కూడా అత్యద్భుతంగా వచ్చి అప్పట్లో ఘనవిజయం సాధించాయి.సినిమా కూడా మంచి హిట్ టాక్ నే సొంతం చేసుకుంది.కానీ ఇప్పటి దర్శకులకు ఎవరికైనా ఇచ్చి ఇలాంటి టాస్క్ చేయమని చెబితే అది జరిగే పని కాదు.

Advertisement

తాజా వార్తలు