భారత సంతతి బ్రిటీష్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌కు ‘‘ క్వీన్ ఎలిజబెత్ II అవార్డ్ ’’ .. !!

భారత సంతతికి చెందిన బ్రిటీష్ హోంమంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్‌ అరుదైన ఘనత సాధించారు.

ఇటీవల కన్నుమూసిన క్వీన్ ఎలిజబెత్ 2 పేరిట నెలకొల్పిన అవార్డ్‌ను అందుకున్న తొలి వ్యక్తిగా సుయెల్లా రికార్డుల్లోకెక్కారు.

లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ‘‘ క్వీన్ ఎలిజబెత్ II : ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ’’ అవార్డును హోంమంత్రి అందుకున్నారు.ఈ నెల ప్రారంభంలో బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ కేబినెట్‌లో సుయెల్లా హోంమంత్రిగా స్థానం పొందిన సంగతి తెలిసిందే.

ఆసియన్ అచీవర్స్ అవార్డ్స్ (ఏఏఏ)- 2022 వేడుకల్లో సుయెల్లా బ్రేవర్‌మాన్ మాట్లాడుతూ.ఇది తన జీవితానికి గౌరవం అన్నారు.ఇటీవల మరణించిన క్వీన్ ఎలిజబెత్‌ IIకు అవార్డ్‌ను అంకితం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

నార్త్ లండన్‌లోని హారోలో ఏప్రిల్ 3, 1980లో జన్మించారు సుయెల్లా బ్రేవర్‌మాన్ .ఆమె అసలు పేరు స్యూ- ఎల్లెన్ కాసియానా ఫెర్నాండెజ్‌.తండ్రి క్రిస్టీ, తల్లి ఉమా ఫెర్నాండెజ్.వీరిద్దరూ భారత సంతతికి చెందినవారే.

Advertisement

వివాహం తర్వాత కెన్యా, మారిషస్‌లలో వున్న ఈ జంట 1960లలో బ్రిటన్‌కు వలస వచ్చారు.ఆమె తల్లి వృత్తి రీత్యా నర్సు.2001 సాధారణ ఎన్నికలలో, 2003 బ్రెంట్ ఈస్ట్ ఉపఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు.బ్రేవర్‌మాన్ తల్లిదండ్రులు హిందువులు.

కానీ ఈమె మాత్రం త్రిరత్న బౌద్ధ సంఘంలో సభ్యురాలు.లండన్ బౌద్ద కేంద్రానికి ఆమె ప్రతి నెలా హాజరవుతారు.

బుద్ధుని సూక్తుల సమాహారమైన ధమ్మపదంపై ఆమె పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.సుయెల్లా భర్త పేరు రేల్ బ్రేవర్‌మాన్.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

ఇకపోతే.ఆసియన్ అచీవర్స్ అవార్డ్స్ ఇప్పుడు 20వ వసంతంలోకి ప్రవేశించాయి.ఇవి బ్రిటన్‌లో దక్షిణాసియా వ్యక్తులు సాధించిన విజయాలను తెలియజేస్తాయి.

Advertisement

అటు వివిధ విభాగాలలో అవార్డులు సాధించిన వారిలో భారత సంతతి వారు వున్నారు.మీడియా విభాగంలో బ్రాడ్‌కాస్టర్ నాగ ముంచెట్టి, ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో నమిత్ మల్హోత్రా, సివిల్ సర్వీసెస్ విభాగంలో కెప్టెన్ హర్‌ప్రీత్ చాందీలు వున్నారు.

ప్రొఫెసర్ శంకర్ బాలసుబ్రమణియన్ డీఎన్ఏ సీక్వెన్సింగ్ ఆవిష్కరణకు గాను ‘‘ప్రొఫెషనల్ ఆఫ్ ది ఇయర్‌’’గా ఎంపికయ్యారు.బ్రిటన్ తరపున ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా సిక్కు పవర్‌లిఫ్టర్ కరెన్‌జిత్ కౌర్ బైన్స్ ‘‘స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌’’గా గెలుచుకున్నారు.ఇక షెర్రీ వాస్వానీకి ‘‘ఎంటర్‌ప్రెన్యూయర్ ఆఫ్ ది ఇయర్’’, రెస్టారెంట్ సోదరులు షామిల్, కవి థక్రార్‌లకు ‘‘బిజినెస్ పర్సన్స్ ఆఫ్ ది ఇయర్’’, కర్తార్ లల్వానీకి ‘‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’’లు దక్కాయి.10 కేటగిరీలలో 500కు పైగా నామినేషన్లు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు.

తాజా వార్తలు