యూకే వెళ్లాలనుకునే వారికి షాక్.. భారీగా పెరిగిన వీసా రుసుములు, ఏది ఎంతంటే?

చదువు, ఉద్యోగం, పర్యాటకం కోసం యూకేకు( UK ) వెళ్లాలనుకునేవారికి అక్కడి ప్రభుత్వం షాకిచ్చింది.

అన్ని రకాల కేటగిరీల వీసా ఫీజులను( Visa Fees ) పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఏప్రిల్ 9 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని తాజా ఆదేశాల్లో తెలిపింది.ప్రస్తుతం ఆరు నెలల కాలానికి బ్రిటన్ వీసా రుసుము 115 డాలర్లు (భారత కరెన్సీలో రూ.12,770) .దానిని 127 పౌండ్లు (భారత కరెన్సీలో రూ.14,103)గా పెంచారు.యూకేలోకి ప్రవేశించడానికి భారతీయులకు సందర్శకుల వీసా( Visitors Visa ) అవసరం.

దానిని 10 శాతం మేర పెంచారు.ప్రస్తుతం ఇది 149 డాలర్లు ఉండగా దానిని 164 డాలర్లకు పెంచారు.

వీసా మినహాయింపు ఉన్న దేశాల ప్రయాణికులకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈటీఏ) ధర 12 డాలర్ల నుంచి 20 డాలర్లకు పెంచారు.వీసా రుసుముల కంటే కొత్త ఈటీఏ ధర కాస్త ముందుగానే ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానుంది.

Advertisement
UK Visa Fees For Visitors Students Workers To Rise From 9 April 2025 Details, UK

వీసా మినహాయింపు ఉన్న దేశాల ప్రజలకు బ్రిటన్‌లో అడుగుపెట్టడానికి ముందు ఈటీఏ అవసరం.ఇది వీసా కాదు కానీ అదే విధంగా పనిచేస్తుంది.

ప్రయాణికుడు యూకేలో అడుగుపెట్టడానికి ముందే బ్రిటన్ అధికారులు భద్రతాపరమైన తనిఖీలు చేయడానికి వీలు కల్పిస్తుంది.

Uk Visa Fees For Visitors Students Workers To Rise From 9 April 2025 Details, Uk

ఇక విద్యార్ధి వీసాల( Students Visa ) రుసుములు కూడా భారీగా పెరగనున్నాయి.ప్రధాన దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన వారు ప్రస్తుతం 490 పౌండ్లు చెల్లిస్తుండగా.దానిని ఇప్పుడు 524 పౌండ్లుగా మార్చారు.ఇది పాఠశాల పిల్లలకు కూడా వర్తిస్తుందని అధికారులు తెలిపారు.11 నెలల లోపు ఆంగ్ల భాషా కోర్సుల్లో చేరినవారికి స్వల్పకాలిక అధ్యయన వీసాల రుసుము 258 డాలర్ల నుంచి 276 డాలర్లకు పెంచారు.

Uk Visa Fees For Visitors Students Workers To Rise From 9 April 2025 Details, Uk

అయితే బ్రిటీష్ ఎడ్యుకేషనల్ ట్రావెల్ అసోసియేషన్ (బీటా)ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమ్మా ఇంగ్లీష్ .ఈ వీసా రుసుముల పెంపుపై ఆందోళన వ్యక్తం చేశారు.బ్రెగ్జిట్ తర్వాత అంతర్జాతీయ పాఠశాలల బృందాలు ఐడీ కార్డులకు బదులు పాస్‌పోర్ట్‌లను ఉపయోగించాలనే నిబంధన కారణంగా ఇప్పటికే సందర్శనలు తగ్గాయని పేర్కొన్నారు.

తీహార్‌లోని మగ ఖైదీల బ్లాక్‌లో యువతి.. కళ్లారా ఏం చూసిందంటే?
కెనడాలో గురుద్వారాపై రెచ్చగొట్టే రాతలు.. అనుమానితుల ఫోటోలు విడుదల

ఈటీఏ రుసుములు పెరగడం మరో అడ్డంకిగా మారి, ఈ రంగంలో సవాళ్లను మరింత తీవ్రతరం చేస్తుందని ఎమ్మా తెలిపారు.యువ ప్రయాణికులు తమ ఆర్ధిక సహకారం, దీర్ఘకాలిక అంతర్జాతీయ సంబంధాలను, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడంలో విలువైన వారని అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు