ఆ వ్యక్తి వాహనాలను కూడా తాకకూడదు.. ఐదేళ్ల పాటు విచిత్రమైన నిషేధం

వివిధ నేరాలకు పాల్పడిన వ్యక్తులకు రాజ్యాంగం ప్రకారం జడ్జిలు శిక్షలు విధిస్తుంటారు.అయితే ఓ బ్రిటిష్ వ్యక్తికి( Britain ) వింత శిక్ష పడింది.

ఐదేళ్ల పాటు వాహనాలను ( Vehicles ) తాకకుండా నిషేధం పడింది.గత 29 సంవత్సరాలుగా నేర చర్యలకు పాల్పడుతున్న బ్రిటీష్ నేరస్థుడికి 5 సంవత్సరాల పాటు ఏ కారును తాకకుండా నిషేధించబడ్డాడు.44 ఏళ్ల ఆ నేరస్థుడి పేరు పాల్ ప్రీస్ట్లీ.( Paul Priestley ) అతను కేంబ్రిడ్జ్‌షైర్‌లోని పెన్నింగ్‌టన్ నివాసి.

చోరీలో భాగంగా కారు తలుపులు తెరవడానికి ప్రయత్నించి కెమెరాలో చిక్కుకున్నాడు.మార్చి 25, 26 తేదీల్లో మూడుసార్లు వాహనాలలో చోరీ చేసేందుకు ప్రయత్నించాడు.

ఇదంతా సీసీటీవీలో కనిపించింది.అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Advertisement

అతడి నుంచి తాళం, కత్తి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

వందలాది దొంగతనాలకు సంబంధించిన కేసులలో పాల్ ప్రీస్ట్‌లీ నేరస్తుడు.కార్ల యజమాని అనుమతి లేకుండా ఎవరూ లేని వాహనాన్ని తాకకూడదు.అయితే ఇతడు మాత్రం చాలా సులువుగా కార్ల తలుపులను తీసి, లోపలికి వెళ్తుంటాడు.

వాటిలోని విలువైన వస్తువులను తస్కరిస్తాడు.తాజాగా అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.

కార్లను ట్యాంపరింగ్ చేయడం, గంజాయిని కలిగి ఉండటం, బహిరంగ ప్రదేశంలో కత్తిని తీసుకెళ్లడం వంటి నేరాలకు గానూ అతడికి తొమ్మిది నెలల జైలు శిక్ష విధించబడింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

పీటర్‌బరో మేజిస్ట్రేట్ కోర్టు అతనికి 9 నెలల జైలు శిక్షతో పాటు రెండు సంవత్సరాల పాటు సస్పెండ్ చేసింది.అతను నిరంతర నేరస్థుడిగా ఉన్నందున, కోర్టు అతనికి మరికొన్ని ఆదేశాలు జారీ చేసింది.మార్చి 2027 వరకు కోర్టు విధించిన కఠిన నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

Advertisement

దీని ప్రకారం అప్పటి వరకు అతడు యజమానుల అనుమతి లేకుండా కార్లను పట్టుకోకూడదు.కనీసం కార్ల డోర్లు కూడా తెరవకూడదు.ఈ విచిత్రమైన శిక్ష విన్న అంతా ఆశ్చర్యపోతున్నారు.

వందలాది దొంగతనాలను చేసిన ఆ వ్యక్తికి మరింత కఠినమైన శిక్ష విధిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు